November 22, 2024
SGSTV NEWS
CrimeTrending

మహీంద్రా థార్‌ ఎక్కి గాలిలో దూసుకెళ్లాడు.. కట్ చేస్తే, సీన్ సీతార్ అయ్యిందిగా.. వైరల్ వీడియో!

 

ప్రతిరోజూ సోషల్ మీడియాలో అనేక రకాల స్టంట్స్ వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. విభిన్న రకాల కంటెంట్‌ని సృష్టించడానికి, వారి వీడియోలపై మరిన్ని ఎక్కువ లైక్‌లను పొందడానికి వ్యక్తులు అలాంటి వీడియోలను సృష్టించి, అప్‌లోడ్ చేస్తారు.


ప్రతిరోజూ సోషల్ మీడియాలో అనేక రకాల స్టంట్స్ వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. విభిన్న రకాల కంటెంట్‌ని సృష్టించడానికి, వారి వీడియోలపై మరిన్ని ఎక్కువ లైక్‌లను పొందడానికి వ్యక్తులు అలాంటి వీడియోలను సృష్టించి, అప్‌లోడ్ చేస్తారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రజలు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో కాస్తా, పోలీసులకు చేరడంతో భలే ట్విస్ట్ ఇచ్చారు.


మహీంద్రా థార్‌ వెహికల్‌తో ఓ మైనర్ బాలుడు స్టంట్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వెంటనే ఉత్తరప్రదేశ్ పోలీసులు రంగంలోకి దిగారు. వెహికల్ నడిపిన బాలుడిపై చర్యలు తీసుకున్నారు ఉత్తరప్రదేశ్ పోలీసులు. ఏకంగా ఆ వాహనానికి రూ.33,500 చలాన్ జారీ చేశారు. ఈ సంఘటన గ్రేటర్ నోయిడాలో జరిగింది. 14 ఏళ్ల మైనర్ బాలుడు మహీంద్రా థార్‌ను గాలిలో ఎగురేశాడు. వైరల్ అయిన వీడియోలో బాలుడు ప్రమాదకరమైన విన్యాసాలు చేశాడు.

స్టంట్ వీడియోను అప్‌లోడ్ చేసిన మైనర్ నాగ్లా గణేషి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు పోలీసులు. ఈ 14 ఏళ్ల మైనర్ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో సుమారు 100 వీడియోలను అప్‌లోడ్ చేశాడు. ఈ వీడియోల్లో చాలా వరకు ఏదో వాహనం స్టంట్‌లకు సంబంధించినవి. ఈ మైనర్ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో దాదాపు 64 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చాలా పాతదేనని పోలీసులు చెబుతున్నారు. మే నెలలోనే ఈ వాహనాన్ని స్టంట్ చేసినందుకు ఇప్పటికే చలాన్ జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ థార్‌కు ట్రాఫిక్ పోలీసులు రూ.33,500 చలాన్ జారీ చేశారు.


ఈ కేసులో థార్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి మైనర్. ఇందుకోసం అతని కుటుంబ సభ్యులు మాత్రమే ఈ చలాన్‌ను చెల్లించాల్సి ఉంటుందని పోలీసులు తెలిపారు. దీంతో పాటు మైనర్ కుటుంబానికి పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. మరోసారి ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే, ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తామని హెచ్చరించారు

Also read

Related posts

Share via