సంబేపల్లి రాయచోటి (అన్నమయ్య) : పురుగులమందు తాగి అంగన్వాడి కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన శనివారం సంబేపల్లి మండలంలో జరిగింది. మండలంలోని దుద్యాల గ్రామం పెద్ద జంగంపల్లికి కు చెందిన జరుగుమల్లె నాగరత్న అంగన్వాడీ కార్యకర్త శనివారం పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేస్తుకున్నట్లు భర్త వీరభద్ర తెలిపారు. ఈ సందర్భంగా వీరభద్ర మాట్లాడుతూ … టిడిపి నాయకులు, ఆంధ్రజ్యోతి విలేకరి వేధింపులు తాళలేక అంగన్వాడి కార్యకర్త పురుగులు మందు తాగి ఆత్మహత్యయత్నం చేసుకుందన్నారు. గత ప్రభుత్వంలో జగనన్న ఇండ్ల పథకంలో నిర్మించుకున్న ఇంటిని ధ్వంసం చేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. తాను వైఎస్‌ఆర్‌సిపి సానుభూతిపరుడు కావడంతోనే తమపై వేధింపులు, దాడులు చేస్తున్నారంటున్న ఆవేదన వ్యక్తం చేశారు
Also read :
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025