November 21, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

21 వ తేదీన  పెనుగొండ పోలీస్ స్టేషన్ పై దాడి చేసిన ఘటనలో 55 మంది అరెస్ట్

*పశ్చిమగోదావరి జిల్లా..*

*21 వ తేదీన  పెనుగొండ పోలీస్ స్టేషన్ పై దాడి చేసిన ఘటనలో 55 మంది అరెస్ట్..*

*వారి అరెస్టుపై  పెనుగొండ CI రజిని కుమార్,SI సుభాని ఆధ్వర్యంలో నర్సాపురం డీఎస్పీ జి.శ్రీనివాసరావు మీడియా సమావేశం*

*ఆచంట గ్రామానికి చెందిన యువకుడు రెండు కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ చేసిన పోస్ట్ పై అతనిపై కేసు నమోదు చేసాం..*

*అదే సమయంలో పెనుగొండ సర్కిల్ ఇన్స్పెక్టర్.. పోస్ట్ చేసిన యువకుడ్ని విచారిస్తున్న సమయంలో..*

*కొంతమంది యువకులు స్టేషన్లో దౌర్జన్యంగా చరబడి.. స్టేషన్ అద్దాలు, సీసీ కెమెరాలు ధ్వంసం చేసిన ఘటనలో కేసు నమోదు చేసాం..*

*ఆ గలాటాలో 22 వ  తేదీన 18 మందిని అరెస్ట్ చేసి.. రిమాండ్ కి పంపించాం..*

*అందులో నలుగురు చిన్నపిల్లలు ఉండడంతో వారిని కస్టడీలోకి తీసుకుని.. జువైనల్ హోమ్ కి  పంపించాం..*

*సిసి ఫుటేజ్ ఆధారంగా 23 మందిని ఐడెంటిఫై చేసి అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపించడం జరిగింది*

*ఈరోజు ఇంకా పదిమంది చిన్న పిల్లలను తీసుకుని.. జువైనల్ హోమ్ కి  పంపించాం..*

*ఈ కేసు ఇంకా దర్యాప్తులో ఉంది.. ఇంకా చాలామందిని అరెస్టు చేయాల్సి ఉంది.*

*ముఖ్యంగా పోలీస్ వారి విన్నపం..*
*యువత ఇలాంటి కేసుల్లో ఉండడం వల్ల.*

*ఉన్నత విద్య, ఉపాధి, చదువులకు పూర్తిగా ప్రశ్నార్థకం..*

*పోలీసు రికార్డులలో ఉండడం..వల్ల వారి భవిష్యత్తు చేచేతుల.. పాడు చేసుకుంటున్నారు.. ప్రభుత్వ ఉద్యోగాలు రావు*

*మంచిగా ఉంటూ.. వారి జీవితంపై మంచి ఆలోచన చేసుకోవాలి.. నరసాపురం డిఎస్పి జి. శ్రీనివాసరావు*

Alao read

Related posts

Share via