ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల్లోని ఏదో చోట గురుకులాలు, కస్తూర్బాల్లోని విద్యార్థులకు ఫుడ్‌పాయిజన్ అవుతూనే ఉన్నది. బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని మైనార్టీ బాలుర ఇంగ్లిష్ మీడియం గురుకులంలో 40 మందికిపైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు
జడ్చర్ల, ఆగస్టు 7 : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల్లోని ఏదో చోట గురుకులాలు, కస్తూర్బాల్లోని విద్యార్థులకు ఫుడ్‌పాయిజన్ అవుతూనే ఉన్నది. బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని మైనార్టీ బాలుర ఇంగ్లిష్ మీడియం గురుకులంలో 40 మందికిపైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర అస్వస్థతకు గురైన 9 మందిని అంబులెన్సులో స్థానిక ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఉదయం అల్పాహారంలో భాగంగా కిచిడీ చేసిన తర్వాత 10 గంటల సమయంలో పలువురు కండుపు నొప్పి తోపాటు వాంతులు చేసుకున్నారు. వైద్యులకు సమాచారం ఇవ్వడంతో స్కూల్‌కు వచ్చి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకొన్న కలెక్టర్ విజయేంద్రబోయి, అదనపు కలెక్టర్ విజయేంద్రప్రతాప్ గురుకులానికి చేరుకొని అస్వస్థతకు గురైన విద్యార్థులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థి తిని అడిగి తెలుసుకున్నారు. పరిసరాలతో పాటు వండిన వంటకాలను పరిశీలించారు. విద్యార్థులతో కలసి మధ్యాహ్న భోజనం చేశారు.
Also read
- Weekly Horoscope: ఆర్థిక వ్యవహారాల్లో వారికి అనుకూలత.. 12 రాశుల వారికి వారఫలాలు
- Andhra Pradesh: ఇలా ఉన్నారేంట్రా.. గోల్డ్ షాపు ఓనర్ కళ్లలో కారం కొట్టి ఇతడు ఏం చేశాడో చూడండి..
- Ugadi 2026: పరాభవ నామ సంవత్సరం అర్థం ఏమిటి..? మనకు ఇచ్చే రహస్య సందేశం ఏంటో తెలుసా..?
- టార్గెట్ ఒకరు.. ప్రాణం పోయింది మరొకరిది.. బట్టల తీగకు కరెంట్ షాక్ పెట్టి హత్య
- దేవాయంలో ప్రదక్షిణలు ఎందుకు చేస్తారు..? ఏ దేవుడికి ఎన్ని ప్రదక్షిణలు చేయాలో తెలుసా..?





