SGSTV NEWS
Andhra PradeshCrime

Kadapa: కడపలో రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డ కుటుంబం



కడప : గూడ్స్ రైలు కింద పడి ఓ కుటుంబం
బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన కడప రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం రాత్రి 11 గంటల తర్వాత చోటు చేసుకుంది. ఆర్పీఎఫ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రైల్వే స్టేషన్ సమీపంలోని మూడో నంబర్ ట్రాక్పై ఓ కుటుంబం వేగంగా వస్తున్న గూడ్స్ రైలుకు ఎదురుగా నిల్చుని ఆత్మహత్యకు పాల్పడింది. రైలు ఢీకొట్టడంతో మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుల్లో భర్త(35), భార్య(30)తో పాటు ఏడాదిన్నర చిన్నారి ఉన్నట్లు గుర్తించారు. మృతదేహాలను రిమ్స్కు తరలించారు. వారు ఎక్కడి నుంచి వచ్చారు.. ఎందుకు రైలు కింద పడి మృతిచెందారనే విషయాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

Also read

Related posts