మేఘాలయ హనీమూన్ కేసు తరహాలో హత్యకు గురైన సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో మరో దిమ్మతిరిగే షాకింగ్ ట్వీస్ట్ బయటకొచ్చింది. కేసులో దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. ప్రియురాలి కోసం ఆమె భర్తనే కాకుండా.. తన భార్యను కూడా హత్య చేసేందుకు తిరుమలరావు ప్లాన్ చేసినట్టు పోలీసులు గుర్తించారు.
దేశవ్యాప్తంగా తీవ్రం సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ కేసు తరహా హత్య గద్వాల జిల్లాలోనూ వెలుగుచూడడం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ప్రియుడితో కలిసి జీవితం పంచుకోవాలనుకున్న మహిళ అతనితో కలిసి భర్తను హత్యచేయించింది. అయితే ఈ కేసులో తాజాగా మరో సంచలన విషయం వెలుగు చూసింది. ప్రియురాలి కోసం ఆమె భర్తను హత్య చేసిన ప్రియుడు.. తన భార్యను కూడా హత్య చేసేందుకు ప్లాన్ చేసినట్టు పోలీసులు గుర్తించారు.
వివరాళ్లోకి వెలితే.. బ్యాంక్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న తిరుమలరావుకు 8 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే తిరుమలరావు కొన్నాళ్లుగా ఐశ్వర్య అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అయితే పెళ్లై ఎనిమిదేళ్లు గడుస్తున్నా తమకు పిల్లలు లేకవడంతో భార్యను అడ్డు తొలగించుకుని.. ఐశ్వర్యతో కలిసి వెళ్లిపోయి అమెతోనే పిల్లలను కనాలని తిరుమలరావు భావించాడు. ఈ క్రమంలో ఐశ్వర్య భర్తతో పాటు తన భార్యను కూడా హత్య చేసేందుకు కుట్రపన్నాడు. అయితే మొదట భార్యను హత్య చేయాలనుకన్న తిరుమలరావు ఆమెను హత్య చేస్తే బంధువుల్లో తనకున్న పేరు పోతుందనే భయంతో తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. తర్వాత ప్రియురాలి ఐశ్వర్యతో మాట్లాడి ఆమె భర్త హత్యకు ప్లాన్ చేశాడు.
తేజేశ్వర్‌ను హత్య చేసేందుకు తిరుమలరావు, ఐశ్వర్య కలిసి ప్లాన్ చేశారు. ఇందుకోసం ఓ సుపారి గ్యాంగ్‌ను సంప్రదించారు. తేజేశ్వర్ అ హత్య కోసం వారితో డీల్ కుదుర్చుకున్నాడు. అనుకున్న ప్రకారం ఓ ల్యాండ్ సర్వే పేరుతో తేజేశ్వర్‌ను కలిసిన సుపారీ గ్యాండ్ ఆతన్ని కార్లో ఎత్తుకెళ్లారు. అయితే తేజేశ్వర్ హత్యకు ముందు రోజు తిరుమల రావు బ్యాంకు నుంచి రూ.20 లక్షలు డ్రా చేశాడు. అందులోంచి రూ.2లక్షలను సుపారీ గ్యాంగ్‌కు ముట్టచెప్పాడు. దీంతో డబ్బులు అందుకున్న సుఫారీ గ్యాంగ్ తేజేశ్వర్‌ను హత్య చేసి.. మృతదేహాన్ని కర్నూలు శివారులో పడేశారు. తర్వాత పనిపూర్తయినట్టు తిరుమల రావుకు సమాచారం ఇచ్చారు. ఇక ఈ కేసు సంబంధించి ఇప్పటికే ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న తిరుమలరావు కోసం గాలిస్తున్నారు.
Also Read
- గ్లిజరిన్ వేసుకుని ఏడ్చినట్లు నమ్మించిందా?.. తేజేశ్వర్ హత్య కేసులో కొత్త అంశం
- Tadipatri: వేట కొడవలితో దాడి.. చికిత్స పొందుతూ యువకుడి మృతి
- Palnadu: పల్నాడు జిల్లాలో దారుణం.. కుమారుడిని చంపి కాలువలో పూడ్చేసిన తండ్రి
- Crime News: ప్రియుడితో కలిసి భర్తను చంపించి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి..
- నేటి జాతకములు..16 జూలై, 2025