ఎదురుకాల్పుల్లో చనిపోయింది 12 మందే…
ప్రజాకోర్టులో ఛత్తీస్‌గఢ్ బీజేపీ నేతలకు శిక్ష తప్పదు
కాంకేర్ ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ స్పందన
నార్త్ సబ్ డివిజన్ బ్యూరో ప్రతినిధి మంగలి పేరుతో లేఖ
, భద్రాద్రి కొత్తగూడెం: ఛత్తీస్‌గఢ్‌లో ఇటీవల జరిగిన అతి పెద్ద ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ స్పందించింది. ఈ ఎదురు కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు చనిపోగా, సజీవంగా దొరికిన 17 మందిని భద్రతా దళాలు హత్య చేశాయని ఆరోపిస్తూ పార్టీ శనివారం లేఖ విడుదల చేసింది.
ఎదురుకాల్పులు ఇలా..
మావోయిస్టు పార్టీ నార్త్ సబ్ జోనల్ బ్యూరో ప్రతినిధి మంగలి తెలిపిన వివరాల ప్రకారం.. వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సహచరులతో పీపు ల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(పీఎల్‌జీఏ) సభ్యులు కాంకేర్ జిల్లాలోని ఆపటోలా, కల్చర్ అటవీ ప్రాంతంలో సమావేశమయ్యారు. ఈ విషయం ఇన్ ఫార్మర్ల ద్వారా తెలుసుకున్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, డిస్ట్రిక్ట్ రిజర్వ్‌గార్డ్ దళాలు ఈనెల 16న మంగళవారం మధ్యాహ్నం ఆ ప్రాంతాన్ని చుట్టుము ట్టాయి. దీంతో ఇరువర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 12 మంది గెరిల్లా ఆర్మీ సభ్యులు చనిపోయారు. గాయపడిన ఆరుగురితో పాటు నిరాయుధులైన 11 మంది సహచరులు భద్రతా దళాలకు చిక్కగా, మిగిలిన వారు తప్పించుకున్నారు.
సీఎం, డిప్యూటీ సీఎంతో చర్చల తర్వాతే హత్యలు..
ఘటనాస్థలిలో గాయాలతో పట్టుబడిన ఆరుగురిని తూటాలకు బలి చేశారని మావోయిస్టు పార్టీ పేర్కొంది. ఆ తర్వాత అదుపులోకి తీసుకున్న 11మందిని సుమారు రెండు కి.మీ. దూరంలో ఉన్న అమరవీరుల స్మారక చిహ్నాల వద్దకు తీసుకెళ్లారని మావోయిస్టు పార్టీ లేఖలో పేర్కొంది. వీరిని తమ వెంట తీసుకెళ్లాలా, లేక చంపేయాలా అనే అంశంపై పోలీసు బలగాల్లో చర్చ జరిగినట్టు పేర్కొంది. ఈ అంశంపై ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్‌సాయ్, డిప్యూటీ సీఎం విజయ్‌శర్మతో ఘటనాస్థలి నుంచి భద్రతా దళాల ప్రతినిధులు చర్చలు జరిపినట్టు ఆరోపించింది. పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు పట్టుబడిన 11మందిని కర్రలతో కొట్టి హింసించి, చివరకు తుపాకులతో కాల్చి చంపారని వెల్లడించింది. వీరి మృతదేహాలను వాహనాల్లో తీసుకెళ్తుండగా రోడ్డుపై పెద్దఎత్తున రక్తస్రావం జరగడమే తమ ఆరోపణలకు సాక్ష్యమని పార్టీ తెలిపింది.
ప్రజాకోర్టులో శిక్ష తప్పదు
ఈ మారణకాండకు బస్తర్‌తో పాటు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన బీజేపీ నేతలు బాధ్యులని పేర్కొంది. వీరికి ప్రజాకోర్టులో కచ్చితంగా శిక్ష పడుతుందని హెచ్చరించింది. మారణకాండకు నిరసనగా ఈనెల 25న నారాయణ్‌పూర్, కాంకేర్, మోహ్లామా¯Œపూర్ జిల్లాల్లో బంద్‌కు పిలుపునిచ్చింది.
Also read
- నెల్లూరులో రౌడీ షీటర్లకు వెరైటీ పనిష్మెంట్.. అలా ఉంటది ఖాకీల తో పెట్టుకుంటే
- Viral News: చెప్తే అర్థం చేసుకుంటారనుకుంది.. తల్లిదండ్రులు మోసాన్ని తట్టుకోలేకపోయింది.. చివరకు..
- Andhra Pradesh: ఛీ.. ఏం మనుషులురా.. కూతురిని కూడా వదలని తండ్రి.. నెలల పాటు దారుణంగా..
- Telangana: ప్రేమన్నాడు.. వల వేసి కోరిక తీర్చుకున్నాడు.. ఆపై వెలుగులోకి అసలు ట్విస్ట్
- Guntur: ఉలిక్కిపడ్డ గుంటూరు.! పట్టపగలు ముగ్గురు మైనర్లు చేసిన పని తెలిస్తే గుండె ఆగినంత పనవుతుంది





