తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ట్రిమ్మర్‌కు ఛార్జింగ్ పెడుతుండగా కరెంట్ షాక్‌కు గురై బొమ్మగాని తిరుపతి (32) మృతి చెందాడు. ఎండపల్లి మండలం ముంజంపల్లిలో జరిగిన ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
రోజు రోజుకూ దేశ వ్యాప్తంగా మృతుల సంఖ్య పెరిగిపోతుంది. కారణం చిన్నదైన మరణం మాత్రం వదిలిపెట్టడం లేదు. రోడ్ యాక్సిడెంట్, కరెంట్ షాక్, అనారోగ్యంతో ఉన్నట్టుండి ఒక్కసారిగా నేలకొరుగుతున్నారు. ఇందులో యువకులు సైతం ఉండటం గమనార్హం. తాజాగా అలాంటిదే జరిగింది. అనుకోని అతిథి కరెంట్ షాక్ రూపంలో వచ్చి ఓ యువకుడిని పొట్టనబెట్టుకుంది.
తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. ట్రిమ్మర్‌కు ఛార్జింగ్ పెడుతుండగా కరెంట్ షాక్‌కు గురై యువకుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం ముంజంపల్లికి చెందిన బొమ్మగాని తిరుపతి (32) ఉపాధి హామీ కూలీగా పనిచేస్తున్నాడు. అతడికి భార్య రేణుక, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆదివారం ఉదయం అతను ట్రిమ్మింగ్ చేసుకోవడానికి ట్రిమ్మర్‌ను తీసుకుని బాత్‌రూంలోకి వెళ్లాడు.
అక్కడ ఛార్జింగ్ పెడుతుండగా ట్రిమ్మర్‌కు కరెంట్ షాక్ వచ్చింది. దీంతో అది ముట్టుకున్న తిరుపతి కరెంట్ షాక్‌కు గురై అక్కడికక్కడే కింద పడిపోయాడు. అది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతడ్ని ధర్మారంలో ఉన్న ఓ ప్రైవేటు హాస్పిటల్‌కి తరలించారు. ఇక అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌లోని మరో ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించారు. కానీ ఫలితం లేకపోయింది. అతడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
Also read
- Air India: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో సైబర్ దాడి కోణం..? ఆపరేటింగ్ సిస్టమ్ హ్యాక్ చేసి..
- బ్లాక్ బాక్స్ ఏ రంగులో ఉంటుంది..? విమానంలో ఏ భాగంలో ఉంటుంది..? ఇది గ్రూప్1 ప్రిలిమ్స్ ప్రశ్న
- తొలిసారి భారత్లో మొదలైన బ్లాక్బాక్స్ డీకోడింగ్ ప్రక్రియ.. ఏ ఒక్క క్లూని వదలని దర్యాప్తు సంస్థలు!
- విమాన శిథిలాల్లో దొరికిన కీలక క్లూ.. DVRను విశ్లేషించనున్న FSL బృందం
- ఎయిరిండియా విమానం కూలిపోవడానికి కారణాలివేనా.? షాకింగ్ విషయాలు చెప్పిన అమెరికా నిపుణులు