SGSTV NEWS
Telangana

ప్రభాకర్రావుకు కస్టమ్స్ అధికారి స్వాగతం, బౌన్సర్లు హంగామా, పోలీసులు సీరియస్



Hyderabad: ఎట్టకేలకు ఏడాది తర్వాత స్వదేశంలో  అడుగుపెట్టారు ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక నిందితుడు, మాజీ ఐపీఎస్ ప్రభాకర్రావు. ఆదివారం సాయంత్రం ఆయన శంషాబాద్ ఎయిర్పోర్టులో అడుగు పెట్టగానే ఆయన నెట్వర్క్ అలర్ట్ అయ్యింది. అంతేకాదు ఆయనకు రక్షణగా బౌన్సర్లు రంగంలోకి దిగేశారు. ఈ విధంగా తాము ఎప్పుడూ చూడలేదని అంటున్నారు అధికారులు.

మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్రావు గురించి చెప్పనక్కర్లేదు. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు. ఆయన్ని అమెరికా నుంచి హైదరాబాదు రప్పించేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు అన్నీఇన్నీకావు. అధికారంలో లేకపోయినా ప్రభాకర్రావు ఎయిర్పోర్టులో దిగగానే ఆయనకు రక్షణగా బౌన్సర్లు రంగంలోకి దిగేశారు.

కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులపై వారు దాడి చేశారు. ఓ రిపోర్టర్ని చాతిలో గుద్దాడు బౌన్సర్. మరి కొంతమంది మీడియా ప్రతినిధులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ విషయంలో పోలీసులు బౌన్సర్లని హెచ్చరించినా మీడియా ప్రతినిధులపై దాడికి పాల్పడ్డారు. కొందరు యూనిఫాంలో కనిపించగా, మరికొందరు సివిల్ డ్రెస్లో కనిపించారు బౌన్సర్లు.

దాదాపు 70 మంది ప్రభాకర్రావు అనుచరులు ఒక్కసారిగా ఎయిర్పోర్టులో ప్రత్యక్షమయ్యారు. ఎయిర్పోర్టు నుంచి ప్రభాకర్ రావు ఇంటివరకు బౌన్సర్లతో భారీ కాన్వాయ్ వచ్చింది. ఆయన్ని ఇంటికి వచ్చిన తర్వాత తిరిగి వెళ్లిపోయారు బౌన్సర్లు. మీడియాతో మాట్లాడటానికి ముఖం చాటేశారు ప్రభాకర్రావు. ప్లాన్ ప్రకారం మీడియాపై దాడికి పాల్పడ్డారు ప్రభాకర్రావు బౌన్సర్లు.


ఇది నాణెనికి ఒకవైపు మాత్రమే. రెండోవైపు వస్తే మాజీ ఐపీఎస్ శంషాబాద్ ఎయిరోపోర్టులో అడుగుపెట్టగానే ఆయనకు ఓ కస్టమ్స్ అధికారి వెల్ కమ్ చెప్పడం అనేక అనుమానాలకు దారి తీస్తోంది. ఈ లెక్కన ఆయన నెట్వర్క్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓ కేసులో నిందితుడికి కస్టమ్స్ అధికారి వెల్కమ్ చెప్పడాన్ని హైదరాబాద్ పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు.

నిబంధనలకు విరుద్ధంగా స్వాగతం పలికారు కస్టమ్స్ అధికారి. ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్నారు పోలీసులు. అందుకు సంబంధించి ఆధారాలు సేకరించారు పోలీసులు. కస్టమ్స్ అధికారికి సంబంధించిన నివేదికను ఉన్నతాధికారులకు పంపారు.

కేసులో నిందితుడికి విధుల్లో ఉన్న అధికారి స్వాగతం పలకడం చట్ట విరుద్ధం. ఇమ్మిగ్రేషన్ అధికారులు అతడ్ని అదుపులోకి తీసుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇప్పుడు కస్టమ్స్ అధికారి స్వాగతం పలికిన ఉదంతం సెన్సేషన్గా మారింది.

ఈ లెక్కన ప్రభాకర్రావు నెట్వర్క్ ఇంకెన్ని విభాగాలకు విస్తరించిందోనని చర్చించుకోవడం కొందరి అధికారుల వంతైంది. ఎయిర్పోర్టులో దిగిన వెంటనే ప్రభాకర్రావును దాదాపు మూడు గంటల పాటు ఉండిపోయారు. ప్రొసీజర్ పూర్తి చేసిన తరువాత ఆయన్ని పంపించారు ఇమిగ్రేషన్ అధికారులు.

Also read

Related posts

Share this