నేహా నాకూ కూతురు వంటిదే
నిందితుని తల్లి ముంతాజ్ ఆవేదన
హుబ్లీ: నగరంలో బీవీబీ కళాశాలలో గురువారం ఎంసీఏ విద్యార్థి నేహా హిరేమఠను కత్తితో పొడిచి హత్య చేసిన నా కొడుకు ఫయాజ్‌ను కఠినంగా శిక్షించాలని అతని తల్లి ముంతాజ్ డిమాండ్ చేశారు. ధార్వాడలో ఆమె శనివారం మీడియాతో మాట్లాడారు. తన కొడుకు చేసిన తప్పును కర్ణాటక ప్రజలు క్షమించాలని, ముఖ్యంగా నేహా తల్లిదండ్రులను క్షమాపణ కోరుతున్నానన్నారు. నేహా కూడా నా కూతురు వంటిదే అని రోదించారు.
నా కొడుకు చేసింది పెద్ద తప్పు. ఎవరి పిల్లలు చేసినా తప్పు తప్పే. చట్ట ప్రకారం శిక్షకు గురి కావాల్సిందే అని ఆమె తెలిపారు. తన కుమారుడిని ఐఏఎస్ అధికారిని చేయాలనే ఆశ ఉండేదన్నారు. చాలా తెలివైన వాడు. ఎల్‌కేజీ, యూకేజీలో 90 శాతం మార్కులు సాధించాడన్నారు. తాను కూడా ఓ ఉపాధ్యాయినిగా వేలాది మంది విద్యార్థులకు పాఠాలు చెప్పాను. ఇప్పుడేమో నా కుమారుడే తప్పు చేశాడు. శిక్షకు తలొగ్గాల్సిందేనన్నారు. కొడుకు చేసిన పని తలదించుకొనేలా చేసిందన్నారు.
స్వామీజీల సమావేశం
నేహా హత్యోదంతంపై పలు మఠాల స్వామీజీలు నెహ్రు మైదానం సమీపంలోని జేసీ పార్కులో సమావేశమై హత్యను తీవ్రంగా ఖండించారు. నిందితుడికి ఉరి శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. అలాగే హిందు సంఘాల కార్యకర్తలు కూడా ఆందోళన చేసి తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కారు
Also read
- నేటి జాతకములు…11 జూలై, 2025
- Hindu Epic Story: స్వర్గాధికధిపతి ఇంద్రుడు ఒళ్ళంతా కళ్ళే.. ఈ శాపం వెనుక పున్న పురాణ కథ ఏమిటంటే..
- Vipareeta Raja Yoga: నెల రోజులు చక్రం తిప్పేది ఈ రాశులవారే..! ఇందులో మీ రాశి ఉందా?
- నా లాగా ఎవరూ మోసపోవద్దు.. కుమారుడు జాగ్రత్త.. అయ్యో అనూష
- Andhra: వదినపై కన్నేసి సెట్ చేశాడు.. కానీ, మరిది అడ్డుగా ఉన్నాడని.. మాస్టర్ స్కెచ్.. చివరకు