స్ధానిక కాపు కళ్యాణ మంటపం వద్ద నిర్వహించిన ఐ.యఫ్.టి.యు అనుబంధ ఆదర్శ ప్లాట్ ఫాం రిక్షా వర్కర్స్ యూనియన్ సమావేశం. అధ్యక్షత వహించిన యూనియన్ ప్రెసిడెంట్ కోనేటి మల్లేశ్వర రావు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కమిటీ సభ్యులు మల్లిడి రామిరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చి అధికారం లోకి వచ్చాక అరకొరగా ప్రకటించారనీ, అసెంబ్లీ సాక్షిగా కార్మిక శాఖ మంత్రి సుభాష్ మహిళా కార్మికుల వివాహ కానుక 40 వేలు ప్రకటించారనీ, జి ఓ లో మాత్రం 20 వేలు మాత్రమే పొందుపరిచారనీ, నిత్యం ప్రమాదకర పరిస్థితుల్లో ఉపాధి పొందే కార్మికుల కు ప్రమాద, అంగవైకల్య పరిహారాలు ఊసే లేదనీ తక్షణమే అన్ని రాష్ట్రాల లో అమలు చేస్తున్న విధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా అన్ని పధకాలను అమలు చేయాలని ప్రధానంగా మరణ పరిహారం 10 లక్షలు ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఐ.యఫ్.టి.యు రాష్ట్ర కమిటీ సభ్యులు ఈమని గ్రీష్మ కుమార్ మాట్లాడుతూ ప్రజల దినసరి వేతనాలు , ఉద్యోగుల కనీస వేతనాలలో ఏవిధమైన పెంపుదలకు శ్రద్ధ చూపని పాలకులు గడిచిన 12 రోజు లలో 4 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు లీటరుకు రు.8/- పైగా పెంపుద్వారా మొత్తం నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయనీ చిరుద్యోగులు, దినసరి కూలీల బ్రతుకు దుర్భరంగా తయారయ్యిందనీ, తక్షణమే పెట్రోల్ , డీజిల్ ,గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలు తగ్గించే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు .
పై కార్యక్రమంలో యూనియన్ నాయకులు పిచ్చా సూర్య కిరణ్ , నంగాలు, సుబ్బారావు , సిర్రా వీర రాఘవులు ,నాగరాజు తదితరులు నాయకత్వం వహించారు .
Also read
- Garuda Purana: మరణం తర్వాత మృతదేహాన్ని మంచం నుంచి తీసి నేలపై ఎందుకు ఉంచుతారు?
- Weekly Horoscope: ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో వారికి శుభవార్తలు.. 12 రాశులకు వారఫలాలు ఇలా..
- అప్పటి వరకు అంత బాగానే సాగింది.. అది స్టార్ట్ చేశాకే అసలు సమస్య మొదలైంది! చివరకు
- ప్రియుడికి సర్ప్రైజ్ ఇచ్చి.. ఆపై కటకటాల్లోకి!
- అప్పుల బాధ తాళలేక.. గోదావరిలోకి దూకిన కుటుంబం





