April 22, 2025
SGSTV NEWS
CrimeTelangana

అమ్మ ఫెయిల్‌ అయ్యా చచ్చిపోతున్నా.. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య!



నాగోల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో విషాదం చోటుచేసుకుంది.  ఇంటర్మీడియట్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ రోజు వెలువడిన తెలంగాణ ఇంటర్‌ ఫలితాల్లో ఫెయిల్‌ అయినందుకు అరుంధతి అనే అమ్మాయి మనస్థాపంతో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.  నారాయణలో బైపీసీ ఫస్టియర్‌ చదువుతున్న విద్యార్థిని అరుంధతి… ఈ రోజు వెలువడిన ఇంటర్‌ ఫలితాల్లో రెండు సబ్జెక్టులలో ఫెయిల్ అయింది.  ఇంటర్‌లో ఫెయిలైన విద్యార్థుల్లో తల్లిదండ్రులు మనోధైర్యం నింపాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇంటర్ పరీక్షల ఫలితాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విడుదల చేశారు. వెలువడిన ఇంటర్ పరీక్షల్లో ఫస్టియర్‌ రెగ్యులర్‌లో 66.89%, వొకేషనల్‌లో 57.68% మంది పాసయ్యారు.  సెకండ్ ఇయర్ రెగ్యులర్ 71.37%, వొకేషనల్‌లో 67.44% విద్యార్థులు పాసయ్యారు.  మొదటి సంవత్సరంలో బాలికల్లో 73.83, బాలురులో 57.83 శాతం పాసయ్యారు. ఇక  సెకండ్ ఇయర్ లో బాలికల్లో 74.21, బాలురులో 57.31 శాతం మంది పాసయ్యారని అధికారులు తెలిపారు.

మే 22 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు
ఇక తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు 2025 మే 22 నుంచి ఉంటాయని ఇంటర్ బోర్డు వెల్లడించింది.  జూన్ 3 నుంచి 6 వరకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. అంతేకాకుండా అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీతో పాటు రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం 2025  ఏప్రిల్ 23 నుంచి ఏప్రిల్ 30 వరకు ఫీజు చెల్లించవచ్చు. 9.97 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయగా పక్కా ప్రణాళికతో ఎక్కడా పొరపాట్లు జరగకుండా వ్యాల్యుయేషన్ జరిగిందని బోర్డు చెప్పుకొచ్చింది. 

Also read

Related posts

Share via