లేడీ అఘోరీకి మోకిలా పోలీసులు ఊహించని షాక్ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ లో అఘోరీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగ్నపూజల పేరుతో మహిళ నుండి 10 లక్షలు వసూలు చేసి మోసానికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొంది. తిరిగి డబ్బులు అడిగినందుకు అఘోరి అలియాస్ శ్రీనివాస్ చంపుతానంటూ బెదిరింపులు దిగారని పోలీసులకు కంప్లైంట్ చేసింది. ఈ నేపథ్యంలో…
లేడీ అఘోరీకి మోకిలా పోలీసులు ఊహించని షాక్ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ లో అఘోరీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగ్నపూజల పేరుతో మహిళ నుండి 10 లక్షలు వసూలు చేసి మోసానికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొంది. తిరిగి డబ్బులు అడిగినందుకు అఘోరి అలియాస్ శ్రీనివాస్ చంపుతానంటూ బెదిరింపులు దిగారని పోలీసులకు కంప్లైంట్ చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. లేడీ అఘోరీని చీటింగ్ కేసులో అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ ,మధ్య ప్రదేశ్ సరిహద్దుల్లో అఘోరీని అదుపులోకి తీసుకుని నగరానికి తీసుకువస్తున్నారు మోకిలా పోలీసులు. అఘోరీతో పాటు ఇటీవల తను వివాహం చేసుకున్న వర్షిణిని కూడా నగరానికి తరలిస్తున్నట్లు సమాచారం.
రంగారెడ్డి జిల్లా, శంకర్ పల్లి మండలం, ప్రొద్దుటూర్ మండలానికి చెందిన ఓ మహిళ లేడీ అఘోరీ మోసాలను ఇటీవల బయటపెట్టింది. లేడీ అఘోరీతో 6 నెలల క్రితం పరిచయం అయినట్లు తెలిపింది. పరిచయం అయిన 2 నెలల తర్వాత ప్రొద్దుటూర్ లోని ప్రగతి రిసార్ట్స్ కు డిన్నర్ కు వచ్చిందని వెల్లడించింది. అప్పటి నుంచి తరచుగా ఫోన్ చేస్తూ వ్యక్తిగత విషయాలను తెలుసుకునేదని తెలిపింది. ఒక పూజ చేస్తే అంతా మంచి జరుగుతుందని మాయమాటలు చెప్పి నమ్మించిందని ఆ మహిళా వెల్లడించింది. లేడీ అఘోరీ మాటలు నమ్మి పూజకు అంగీకరించానని తెలిపింది.
వారం రోజుల్లో పూజ చేద్దామని అందుకు ఖర్చుల కోసం రూ. 5 లక్షలు లేడీ అఘోరీ అకౌంట్ లో వేశానని తెలిపింది. ఆ తర్వాత పూజ కోసం యూపీలోని ఉజ్జయినిలోని ఫాం హౌస్ లోకి తీసుకెళ్లి పూజ చేసిందని తెలిపింది. మరుసటి రోజు మరో రూ. 5 లక్షలు తన అకౌంట్ లో వేయాలని లేకపోతే పూజ విఫలమై కుటుంబం నాశనమవుతుందని లేడీ అఘోరి భయపెట్టిందని చెప్పింది. అఘోరి మాటలకు భయపడిపోయి రూ. 5 లక్షలు అకౌంట్ లో వేశానని ఇలా మొత్తం రూ. 10 లక్షలు ముట్టజెప్పానని పోలీసుల ఫిర్యాదులో పేర్కొంది. దీన్ని అలుసుగా చేసుకుని అఘోరి మాతతో పూజ పూర్తి చేసుకున్నావు కనుక ఇంకా 5 లక్షలు ఇవ్వాలని లేదంటే నిన్ను, కుటుంబ సభ్యులను మంత్ర శక్తులతో అంతమొందిస్తానని.. బెదిరింపులకు పాల్పడ్డట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది
Also read
- నేటి జాతకములు…22 మే, 2025
- Garuda Purana: అల్లుడితో సంబంధం పెట్టుకునే అత్తకు గరుడ పురాణం ప్రకారం ఎటువంటి శిక్షలు విధిస్తారంటే
- ‘నీ బిడ్డనిచ్చి పెళ్లి చెయ్’ – సహజీవనం చేసిన మహిళకు వ్యక్తి బెదిరింపులు
- కోర్టు సినిమా తరహాలో కడపలో రియల్ సీన్ సంచలనం.. పోలీసుల సమక్షంలోనే..
- Vizianagaram Case: విజయనగరం టెర్రర్ కేసులో మరిన్ని సంచలనాలు