SGSTV NEWS online
CrimeTelangana

యువకులు, ప్రభుత్వ ఉద్యోగులే టార్గెట్ – నిందితుడు ‘హనీట్రాప్’తో మాయాజాలం చేశాడిలా!



హైదరాబాద్‌లోని సైదాబాద్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన హనీట్రాప్ కేసు దర్యాప్తు మరింత లోతుగా సాగుతోంది. నిందితుడు పవన్ కుమార్, తనకు ఉద్యోగం దొరకకపోవడంతో డబ్బు సంపాదిం

హైదరాబాద్‌లోని సైదాబాద్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన హనీట్రాప్ కేసు దర్యాప్తు మరింత లోతుగా సాగుతోంది. నిందితుడు పవన్ కుమార్, తనకు ఉద్యోగం దొరకకపోవడంతో డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ మోసానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. పవన్, ‘గే’ యాప్‌లో ఇతరులతో పరిచయాలు పెంచి, అందమైన అమ్మాయిల ఫొటోలు ఉపయోగించి నకిలీ ఖాతాలు సృష్టించాడు. యువకులు, ప్రభుత్వ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని, వారితో అశ్లీల సంభాషణలు జరిపి, నగ్న ఫొటోలు, వీడియోలు సేకరించాడు. ఈ విధంగా దాదాపు వెయ్యి మందితో చాటింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. నాలుగేళ్లుగా ఈ మోసాలకు పాల్పడుతున్న పవన్, ఏడాదిన్నరలో దీనిని ప్రధాన ఆదాయ మార్గంగా మార్చుకున్నాడు. పవన్, సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన కొందరిని హోటళ్లకు రప్పించి, అక్కడ రహస్యంగా వీడియోలు చిత్రీకరించి, వాటిని ఆధారంగా తీసుకుని డబ్బులు డిమాండ్ చేసేవాడు. బాధితులు సమాజంలో పరువు పోతుందనే భయంతో అతడికి డబ్బులు ఇచ్చేవారని పోలీసులు తెలిపారు.

పవన్ కుమార్, తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ, మహారాష్ట్ర, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో కూడా తన మాయాజాలానికి బలైన బాధితులను లక్ష్యంగా చేసుకున్నాడు. నిందితుడి మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్‌లో కొన్ని నగ్న వీడియోలు, ఫొటోలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. ఈ ఆధారాలపై బాధితులను సంప్రదించి అప్రమత్తం చేస్తున్నారు. పవన్, తన తల్లిదండ్రులను ఆసుపత్రిలో చేర్పించానని, అత్యవసర చికిత్సకు డబ్బులు కావాలని చెప్పి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేశాడు. మరోవైపు, తన సోదరి ఆత్మహత్యాయత్నం చేసుకుందని, ఆమెకు ఏమైనా జరిగితే బాధితులే కారణమంటూ వాట్సప్ కాల్స్‌లో బెదిరించి డబ్బు వసూలు చేసినట్లు సమాచారం. పవన్, తిరుమల, శబరిమల వంటి పుణ్యక్షేత్రాల్లో వీఐపీ దర్శనాలు ఇప్పిస్తానంటూ నమ్మించి భారీగా డబ్బులు కాజేసినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు.

సైదాబాద్ పోలీసులు ఇటీవల పవన్ కుమార్‌ను అరెస్టు చేశారు. ఛార్మినార్ జోన్ డీసీపీ కిరణ్ ఖరే పర్యవేక్షణలో దర్యాప్తు కొనసాగుతోంది. అయితే, నిందితుడి సెల్‌ఫోన్‌లోని నంబర్ల ఆధారంగా బాధితులకు ఫోన్ చేసినప్పటికీ, ఎవరూ స్పందించడం లేదు. కొందరు ఫోన్లు స్విచ్ఛాఫ్ చేస్తుండగా, మరికొందరు తమకు ఎలాంటి నష్టం జరగలేదని చెబుతున్నారు. ఇంకొందరు తమ వివరాలు బయటపడితే కుటుంబంలో, సమాజంలో పరువు పోతుందనే ఆందోళనతో ఫిర్యాదు చేసేందుకు వెనకాడుతున్నారు. అయితే, బాధితుల వివరాలను గోప్యంగా ఉంచుతామని డీసీపీ కిరణ్ ఖరే భరోసా ఇచ్చారు. నిందితుడి కస్టడీ పూర్తయ్యాక వైద్య పరీక్షలు నిర్వహించి, అనంతరం జైలుకు తరలించనున్నారు. బాధితులు ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తే కేసులో మరిన్ని మోసాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Also read

Related posts