లోన్ యాప్‌లో డబ్బులు అప్పుగా తీసుకుని జల్సాలకు పాల్పడుతున్నారు కొందరు యువకులు. ఇక యాప్ నుంచి తీసుకున్న డబ్బును తిరిగి చెల్లించలేక.. అటు లోన్ యాప్ నిర్వాకులు పట్టే టార్చర్ భరించలేక ఎలాగైనా ఫ్రీగా డబ్బులు సంపాదించాలన్న నేపధ్యంలో దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే ఓ యువకుడు ఏకంగా యూట్యూబ్ చూసి చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డాడు. చివరికి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులకు దొరికిపోయి.. కటకటాలు పాలయ్యాడు. ఈ ఘటన సిద్ధిపేట జిల్లాలో చోటు చేసుకుంది
వివరాల్లోకెళ్తే.. సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట మండలం భూంపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలోని కమాన్ వద్ద ఏనగుర్తి గ్రామానికి చెందిన యాదమ్మ అనే 50 సంవత్సరాల మహిళ గత మూడు నెలలుగా కల్లు విక్రయిస్తూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలోనే గురువారం సదరు నిందితుడు యాదమ్మ ఒంటరిగా ఉండటాన్ని గమనించి.. తన ద్విచక్ర వాహనంపై కల్లు తాగేందుకు అక్కడికి వచ్చాడు. ఇక కల్లు తాగేసి తిరిగి వెళ్తుండగా.. ఆమె మెడలో ఉన్న రెండు తులాల బంగారు గొలుసును లాక్కుని వెళ్లిపోయాడు. ఈ దొంగతనానికి సదరు నిందితుడు బైక్ పైన వచ్చి దొంగతనం ఎలా చేయాలి.? అని యూట్యూబ్ వీడియో ఆధారంగా పాల్పడ్డాడు. ఇక బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన భూంపల్లి పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కోసం గాలించారు.
అటు దుబ్బాక, ఇటు భూంపల్లి పోలీసులు రెండు టీంలుగా విడిపోయి ఈ కేసును దర్యాప్తు చేయగా.. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన లవన్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. తమదైన శైలిలో విచారణ జరపగా.. నేరం తానే చేసినట్టు ఒప్పుకున్నాడు లవన్ కుమార్. దీంతో అతడి దగ్గర నుంచి దోచుకున్న వస్తువులను దుబ్బాక సీఐ రికవరీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఐ శ్రీనివాస్.. లోన్ యాప్‌ల ద్వారా యువత అప్పుగా డబ్బులు తీసుకుని జల్సాలకు పాల్పడుతూ.. వాటిని తీర్చలేక యాప్ యాజమాన్యం ఇబ్బందులకు తట్టుకోలేక.. పెడదారిన పడుతున్నారని చెప్పారు. అలాంటి వాటి జోలికి వెళ్లొద్దని సూచించారు. సదరు యువకుడు యాప్‌లో తీసుకున్న డబ్బులు చెల్లించలేక.. ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో యూట్యూబ్ చూసి దొంగతనానికి పాల్పడినట్టు తెలిపారు. ఇలాంటి వాటికి యువత దూరంగా ఉండాలని.. తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని పోలీసులు చెబుతున్నారు.
Also read
- Palnadu: భార్యపై అనుమానంతో భర్త ఘాతుకం.. ఏం చేశాడో తెలుస్తే షాక్!
- AP Crime: ఏపీలో దోపిడి దొంగల బీభత్సం.. పట్టపగలే ఇళ్లలోకి దూరి!
- అప్పు ఇచ్చిన వ్యక్తితో అక్రమ సంబంధం.. మొక్కజొన్న చేను దగ్గర సైలెంట్‌గా లేపేసింది!
- వరూధుని ఏకాదశి రోజున తులసితో ఈ పరిహారాలు చేయండి.. పెండింగ్ పనులు పూర్తి అవుతాయి..
- Swapna Shastra: కలలో ఈ మూడు పక్షులు కనిపిస్తే మీకు మంచి రోజులు వచ్చాయని అర్ధమట..