నల్గొండ జిల్లాలో ఓ యువతి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్‌లో స్టాఫ్ నర్స్‌గా పనిచేస్తున్న మల్లేశ్వరి జాన్ రెడ్డిని ప్రేమించింది. తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. 15 రోజుల కిందట మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో ఆత్మహత్య చేసుకుంది.
Nalgonda Crime: నల్గొండ జిల్లా బొకంతలపాడులో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రియుడు మోసం చేశాడని ఓ యువతి బలవన్మరణం చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లో స్టాఫ్ నర్స్‌గా పనిచేస్తున్న మల్లేశ్వరి అనే యువతి జాన్ రెడ్డి అనే వ్యక్తిని ప్రేమించింది. తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. జాన్ రెడ్డి 15 రోజుల కిందట మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో మల్లేశ్వరి మనస్థాపం చెంది హాస్టల్లోనే మత్తు ఇంజక్షన్ తీసుకుని మృతి చెందింది. దీంతో యువతి డెడ్‌బాడీని తీసుకుని కుటుంబ సభ్యులు జాన్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేశారు. జాన్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు
సంగారెడ్డి జిల్లాలో కూడా..
ఇదిలా ఉండగా.. సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. ఓ భర్త భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. పఠాన్ చెరువు మండలంలో పెద్దకంజర్ల గ్రామం రమిలా అనే మహిళకు సురేష్ (32)తో ఐదు సంవత్సరాల క్రితం ఘనంగా వివాహం జరిగింది. వీరికి మూడేళ్ల కూతురు కూడా ఉంది. పెళ్లి అయినప్పటి నుంచి ఈ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు.
కానీ గత కొన్ని రోజుల నుంచి ఇద్దరి మధ్య గొడవలు పెరిగాయి. చివరకు పంచాయతీ వరకు కూడా వెళ్లారు. ఈ క్రమంలో రమిలా తన తల్లి ఇంటి దగ్గర ఉంటుంది. అయితే ఈ సమయంలో కూడా సురేశ్ అక్కడికి వెళ్లి గొడవ పడేవాడు. ఓ రోజు తీవ్ర ఆగ్రహానికి గురై రోకలి బండతో రమిలాపై దాడి చేశాడు. అడ్డు వచ్చిన అత్తను కూడా రోకలితో కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. కుటుంబ సభ్యుల అనుమతితో సురేష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.
Also read
- ఈ ఆలయంలో మీ ప్రశ్న నిజమైతే ‘శిల’ తిరుగుతుంది! – ‘శివాజీ’ యుద్దానికి వెళ్లేముందు ఇక్కడికి వచ్చేవారట!
- సముద్రపు అలలు చేసే శివాభిషేకం.. పాండవులు ప్రతిష్ఠించిన 5 శివలింగాల ఆలయం ఎక్కడుందో తెలుసా?
- భూమి నుంచి ఆకాశం వరకు పరమశివుని పంచభూత క్షేత్రాలు.. జీవితంలో ఒక్కసారైనా దర్శించాల్సిందే!
- Hyderabad: ఉప్పుగూడ రైల్వే స్టేషన్ సమీపంలో దారుణం.. గంజాయి మత్తులో యువకుల హల్చల్
- మద్యం మత్తులో భార్యపై కత్తితో దాడి.. ఇద్దరు అక్కాచెల్లెళ్లను పెళ్లి చేసుకున్న భర్త అరాచకం




