మార్కాపురం (ప్రకాశం) : తన కుమార్తెను వేధిస్తున్న యువకుడిని మరదలించాడన్న కోపంతో యువతి తండ్రిపై యువకుడు నలుగురితో కలిసి వచ్చి కత్తితో దాడి చేసిన ఘటన శనివారం మార్కాపురంలో జరిగింది. నాలి సత్యనారాయణ మార్కాపురంలోని నెహ్రూ బజార్లో సిమ్‌కార్డు డిస్ట్రిబ్యూటర్ గా పనిచేస్తున్నారు. ఇంటర్మీడియట్ తన కుమార్తెను ఓ యువకుడు వేధిస్తుండటంతో అతడిని సత్యనారాయణ మందలించాడు. దీంతో ఆ యువకుడు తనతోపాటు మరో నలుగురిని రెండు బైక్‌లపై తీసుకొచ్చి యువతి తండ్రిపై కత్తితో దాడి చేశాడు. అనంతరం అక్కడి నుండి వారంతా పారిపోయారు. దాడిని గమనించిన స్థానికులు వెంటనే సత్యనారాయణను ఆటోలో మార్కాపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న మార్కాపురం పట్టణ పోలీస్ స్టేషన్ ఏఎస్‌ఐ షేక్ మునాఫ్ ఆస్పత్రికి చేరుకొని బాధితుడి వద్ద నుండి వివరాలు సేకరించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు
Also read :
- Texas: నెల రోజుల్లో ఇంటికి రావాల్సుంది..అంతలోనే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది!
- కొబ్బరిబొండాల కత్తితో ఇద్దరు కొడుకులను నరికి భవనం పై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్న తల్లి
- పూజలో కలశం ప్రాముఖ్యత ఏమిటి? మామిడి ఆకులు, కొబ్బరికాయ ఎందుకు పెడతారో తెలుసా..
- Shukra Gochar 2025: మీనరాశిలో శుక్రుడు అడుగు.. మాలవ్య, లక్ష్మీనారాయణ యోగాలు .. మూడు రాశుల వారు పట్టిందల్లా బంగారమే..
- Jupiter Transit 2025: 12 ఏళ్ల తర్వాత బృహస్పతి మిథునరాశిలోకి అడుగు.. మొత్తం 12 రాశులపై ప్రభావం ఎలా ఉంటుంది? పరిహారాలు ఏమిటంటే