లేడీ అఘోరీ మరోమోసం బయటపడింది. యోని పూజ పేరుతో రూ.10లక్షలు దోచేసినట్లు ఓ మహిళా నిర్మాత మొకిలా పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో అఘోరీపై 308(5), 318(1),351(4),352 BNS సెక్షన్లకింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Aghori: లేడీ అఘోరీ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పూజల పేరిట భారీ మోసాలకు పాల్పడ్డట్లు సైబరాబాద్ మొకిలా పీఎస్‌లో కేసు నమోదైంది. యోని పూజ చేస్తానంటూ రూ.10 లక్షలు తీసుకుని మోసం చేసిందంటూ మహిళా నిర్మాత ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఉజ్జయినిలోని ఫాంహౌస్‌కి తీసుకెళ్లి పూజ చేసినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. రెండు విడతలుగా అఘోరీకి రూ. 10 లక్షలు ఇచ్చినట్లు తెలిపింది. దీంతో ఫిబ్రవరి 25న అఘోరీపై 308(5), 318(1),351(4),352 BNS సెక్షన్లకింద ఎఫ్ఐఆర్ నమోదైంది.
ప్రగతి రిసార్ట్స్ కు వెళ్లి..
పోలుసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లాకు చెందిన ప్రొడ్యూసర్ లేడీ అఘోరీతో 6 నెలల క్రితం పరిచయం అయినట్లు చెప్పింది. దీంతో ప్రొద్దటూర్ లోని ప్రగతి రిసార్ట్స్ కు అఘోరిని డిన్నర్ కు పిలవగా వచ్చినట్లు తెలిపింది. అప్పటి నుంచి ఫోన్ చేస్తూ తన వ్యక్తిగత విషయాలు తెలుసుకుంది. ఒక పూజ చేస్తే అంతా మంచి జరుగుతుందని నమ్మించింది. అది కూడా ప్రైవేట్ పార్ట్ యోని పూజ అని చెప్పడంతో నిర్మాత పూజకు అంగీకరించింది.
ఈ క్రమంలోనే పూజ సామాగ్రి కోసం మొదట రూ. 5 లక్షలు అఘోరీ అకౌంట్ లో వేసింది. మొదటిసారి యూపీలోని ఉజ్జయిని ఫాం హౌస్ తీసుకెళ్లి పూజ చేసింది. ఆ తర్వాత మరో రూ.5 లక్షలు ఇవ్వాలని అడిగింది. లేదంటే పూజ విఫలమై ఫ్యామిలీ మొత్తం నాశనం అవుతుందని భయపెట్టింది. భయంతోనే మరో 5 లక్షలు అకౌంట్ లో వేసింది. మొత్తం రూ.10 లక్షలు పంపించినట్లు ఫిర్యాదులో మహిళా నిర్మాత పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.
Also read
- పోలీస్ స్టేషన్లో కాల్పుల కలకలం.. AK-47తో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్యాయత్నం!
- మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్‌టియు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!





