April 21, 2025
SGSTV NEWS
CrimeNational

విద్యార్థినులపై కామాంధుని వల


• అత్యాచారం చేసి వీడియోలు షూట్

. ఉడుపిలో వ్యాపారవేత్త అఘాయిత్యం



యశవంతపుర: రాష్ట్రంలో తరచూ ఎక్కడో ఒకచోట కామాంధుల
అఘాయిత్యాలు సమాజంలో ఆందోళన కలిగిస్తున్నాయి. ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల పెన్ఫ్రావ్ సంఘటన ఒకవైపు సంచలనం సృష్టిస్తుండగా, మరోవైపు ఉడుపిలోనూ అదే మాదిరి సంఘటన బయటపడింది. వ్యాపారవేత్త శ్రేయస్ నాయక్ (25) పలువురు బాలికలపై లైంగిక దౌర్జన్యానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. జిల్లాలోని కుందాపుర తాలూకాలో అమావాస్యె బైలు పోలీసుస్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. శ్రేయస్పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేయటంతో పరారయ్యారు. విద్యార్థులపై లైంగిక దాడులు జరిపి అశ్లీల వీడియోలను తీసి తన ల్యాప్టాప్లో ఉంచుకున్నట్లు బయట పడింది.

ఎక్కువగా కాలేజీ విద్యార్థులను మాయమాటలు చెప్పి గత సంవత్సరం నుంచి లైంగిక దాడులకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఉడుపిలో హాలాడి రోడ్డులోని హెగ్గూడ్లులోని ప్రాంతానికి తీసుకెళ్లి కారులో లైంగిక దౌర్జన్యాలకు పాల్పడిన్నట్లు అరోపణలు వస్తున్నాయి. వీడియోలు తీసుకున్న నిందితుడు వాటిని చూపి తను పిలిచినప్పుడు రావాలని బ్లాక్మెయిల్ చేసేవాడు. ఒక బాలిక అతని వల్ల గర్భవతి కూడా అయ్యింది. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో మే 18న పోక్సో కేసు నమోదైంది. ఆ తరువాత విచారణలో అతని అకృత్యాలు ఒక్కొక్కటే వెలుగుచూశాయి. అంతలోనే దుండగుడు పరారయ్యాడు. శ్రేయస్ అరెస్ట్కు పోలీసు బృందాలు గాలింపు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ డా. కె. అరుణ్ ఆదివారం తెలిపారు.

Also read

Related posts

Share via