భూ ఆక్రమణను అడ్డుకున్న ఇద్దరు ఎస్టీలపై వైకాపా ఎంపీపీ భర్త డాడికి పాల్పడిన ఘటన గురువారం సాయంత్రం ప్రకాశం జిల్లా దర్శిలో జరిగింది.
దర్శి, : భూ ఆక్రమణను అడ్డుకున్న ఇద్దరు ఎస్టీలపై వైకాపా ఎంపీపీ భర్త డాడికి పాల్పడిన ఘటన గురువారం సాయంత్రం ప్రకాశం జిల్లా దర్శిలో జరిగింది. బాధితుల కథనం మేరకు.. దర్శి నగర పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 1071లో కొత్తరెడ్డిపాలెం సమీపంలో ప్రభుత్వ కుంట పోరంబోకు భూమి ఉంది. దీనిని మండలంలోని రాజంపల్లి గ్రామానికి చెందిన కొందరు ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్నారు. ఇందులో రెండు ఎకరాల భూమిని అదే గ్రామానికి చెందిన ఎస్టీ కాలనీవాసులు ఇరవై సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నారు. దర్శి-పొదిలి ప్రధాన రహదారి పక్కనే ఈ భూమి ఉండడం, విలువ భారీగా పెరగడంతో అదే గ్రామానికి చెందిన వైకాపా నాయకుల కన్ను దానిపై పడింది. ఆ భూమిని కాజేయాలనే లక్ష్యంతో గురువారం ఇతర ప్రాంతాలకు చెందిన కొందరిని దర్శి ఎంపీపీ జి.సుధారాణి భర్త అచ్చయ్య తీసుకొచ్చి భూమిని యంత్రాలతో చదును చేసేందుకు ప్రయత్నించారు. ఆ భూమిని సాగు చేసుకుంటున్న బండి వీరాంజనేయులు, తలకు, కంటి వద్ద తీవ్ర గాయమైంది. రవి తలకు కూడా గాయమైంది. వారిని దర్శి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వీరాంజనేయుల్ని ఒంగోలు రిమ్స్కు తరలించారు. ఈ గొడవపై క్షతగాత్రుల బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో గొడవలో తనకు కూడా గాయమైందని అచ్చయ్య దర్శి ప్రభుత్వ వైద్యశాలకు వచ్చారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025