SGSTV NEWS
Andhra Pradesh

MLC Duvvada Srinivas తిరుమల లో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, మాధురి హల్చల్



తిరుమలలో వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్తో కలిసి మాధురి హల్చల్ చేశారు.



తిరుమల: వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్తో కలిసి మాధురి తిరుమలలో హల్చల్ చేశారు. శ్రీవారి ఆలయం, పుష్కరిణి వద్ద ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ హంగామా సృష్టించారు. సోమవారం ఉదయం దువ్వాడ శ్రీనివాస్, మాధురి శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఈ సందర్భంగా మాధురి.. తమ సహాయకులతో కలిసి శ్రీవారి ఆలయం, పుష్కరిణి, మాడవీధుల్లో వీడియోలు, ఫొటోలు తీసుకుంటూ గడిపారు. ఆధ్యాత్మిక ప్రాంతమైన తిరుమలలో వారు వ్యవహరించిన తీరుపై పలువురు భక్తులు విస్మయం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మాధురి మీడియాతో మాట్లాడుతూ.. “దువ్వాడ శ్రీనివాస్ను త్వరలోనే వివాహం చేసుకుంటాను. వారి సతీమణి విడాకుల వ్యవహారం న్యాయస్థానం పరిధిలో ఉన్నందున ప్రస్తుతానికి సహజీవనం చేస్తున్నాను. విడాకులు రాగానే అధికారికంగా వివాహం చేసుకుంటాం” అని తెలిపారు.

Also read

Related posts