December 4, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

పోలీసుల ఎదుట హాజరైన వైసీపీ నేత గౌతమ్ రెడ్డి

హత్యాయత్నం కేసులో వైసీపీ నేత, ఏపీ ఫైబర్నెట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గౌతమ్ రెడ్డి మంగళవారం సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ కు హాజరయ్యారు.



అమరావతి – విజయవాడ

(గాంధీనగర్): హత్యాయత్నం కేసులో వైసీపీ నేత, ఏపీ ఫైబర్నెట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ గౌతమ్ రెడ్డి మంగళవారం సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ కు హాజరయ్యారు. రూ.కోట్ల విలువైన స్థలం కబ్జా కేసులో బాధితుడు గండూరి ఉమామహేశ్వరశాస్త్రి గత నెల 6న ఫిర్యాదు చేశారు. శాస్త్రిని హతమార్చేందుకు ఓ ముఠాతో గౌతమ్ రెడ్డి రూ. 25 లక్షలకు ఒప్పందం కుదర్చుకున్నట్లు పోలీసు దర్యాప్తులో వెల్లడైంది. ఏసీపీ స్రవంతిరాయ్ ఇచ్చిన నోటీసుల మేరకు ఆయన మంగళవారం రాత్రి ఆమె ఎదుట హాజరయ్యారు. ఈ కేసులోని 9 మంది నిందితుల్లో ఏడుగురు ఇప్పటికే అరెస్టు అయ్యారు. వారి నుంచి రాబట్టిన సమాచారం ఆధారంగా గౌతమ్ రెడ్డి ఏసీపీ ప్రశ్నించగా, పొడిపొడిగా సమాధానం చెప్పినట్లు తెలిసింది. ఈ కేసుకు, తనకు ఏమాత్రం సంబంధం లేదన్నారు. ఫోన్ స్వాధీనం చేయాలని ఏసీపీ అడగగా .. నిబంధనల ప్రకారమే ఇస్తానని సమాధానమిచ్చారు. ఈ నెల 7న మరోసారి హాజరవ్వాలని నోటీస్ ఇచ్చి పంపేశారు. తర్వాత గౌతమ్ రెడ్డి మీడియాతో  మాట్లాడుతూ శాసనమండలి ఎన్నికల్లో పోటీ చేస్తున్నందునే ప్రభుత్వం తనను ఈ కేసులో ఇరికించిందని ఆరోపించారు

Also read

Related posts

Share via