అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో పవర్ లూమ్స్ స్పేర్ పార్ట్స్ దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో యంత్ర సామగ్రి, స్పేర్ పార్ట్స్ అగ్నికి ఆహుతయ్యాయి. స్థానిక అగ్నిమాపక సిబ్బంది సమయానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు..
అన్నమయ్య జిల్లా, ఫిబ్రవరి16 : అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె ప్రాంతంలో గల నీరుగట్టువారిపల్లెలో అమృత ట్రేడర్స్ పవర్ లూమ్స్ స్పేర్ పార్ట్స్ దుకాణంలో సోమవారం ఆగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో దుకాణంలోని స్పేర్ పార్ట్స్, యంత్ర సామగ్రి పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి.
సుమారు రూ.10 లక్షల వరకు నష్టం వాటిళ్లిందని బాధితుడు వాపోయాడు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసి, పరిస్థితిని నియంత్రించారు. అయితే, అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది దుకాణంలో సాంకేతిక పరికరాలు, విద్యుత్ సరఫరా తదితరాలను పరిశీలించారు. దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Also read
- టీచర్ కొట్టడంతో యూకేజీ విద్యార్థి మృతి
- Weekly Horoscope: ఉద్యోగంలో గుర్తింపు, ఆర్థిక లాభాలు.. ఈ రాశులకు గోల్డెన్ టైమ్..!
- యువతి రిప్లే ఇవ్వలేదని యువకుడి ఆత్మహత్య!
- విశాఖ షీలానగర్‌లో మృతదేహాల కలకలం!
- బాడీకి బాంబుల్లా కట్టుకున్నారు.. లోపల ఏముందో చూసి పోలీసులే షాక్!





