భారత్ దాడులతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అంతర్జాతీయ సాయం కోసం అర్రులు చాస్తోంది. పెద్దన్న నువ్వే కల్పించుకోవాలని వేడుకుంటోంది. వివరాల్లోకి వెళ్తే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మాట్లాడేందుకు పాకిస్తాన్ యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి
భారత్ దాడులతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అంతర్జాతీయ సాయం కోసం అర్రులు చాస్తోంది. పెద్దన్న నువ్వే కల్పించుకోవాలని వేడుకుంటోంది. వివరాల్లోకి వెళ్తే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మాట్లాడేందుకు పాకిస్తాన్ యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. భారత్, పాక్ మధ్య పరస్పర దాడుల నేపథ్యంలో అమెరికా మధ్యవర్తిత్వం కోరుతోంది పాకిస్తాన్. ట్రంప్ స్పందన కోసం పాకిస్తాన్ ఎదురుచూపులు చూస్తోంది. అలాగే అంతర్జాతీయ మద్దతు కోసం పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తోంది.
మరోవైపు భారత్‌ను తాము ఆపలేమని అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్స్ శుక్రవారం ఓ ప్రకటనలో చెప్పేశారు. ఈ వ్యవహారంలో అమెరికా జోక్యం చేసుకోదన్నారు. ఈ ఉద్రిక్తతలు తగ్గాలనే అమెరికా కోరుకుంటోందన్నారు వాన్స్. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆయుధాలు వదలాలని కోరుకుంటున్నట్లు అమెరికా ఉపాధ్యక్షుడు స్పష్టం చేశారు. దౌత్యపరమైన మార్గాల ద్వారానే సమస్య పరిష్కారం అవుతుందన్నారు JD వాన్స్. అయితే పాకిస్తాన్ మాత్రం పెద్దన్న సాయం కోరుతుంది.
Also read
- వాచ్మెన్ దారుణ హత్య.. సీసీ కెమెరాల్లో రికార్డైన భయానక దృశ్యాలు..!
- శ్రీశైలంలో విషాదం.. అన్నదాన సత్రంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి ఆత్మహత్య!
- పాము కాటుకు నాటు వైద్యం.. పరిస్థితి విషమించి యువకుడి మృతి..!
- AE నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో ట్విస్ట్.. రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు..
- Raksha Bandhan: తొలిసారి రాఖీ ఎవరు ఎవరికి కట్టారు? పురాణాల్లోని ఆసక్తికరమైన కథలు





