పాకిస్తాన్‌లోని రావల్పిండి సమీపంలో ఒకదాని తర్వాత ఒకటి మూడు పేలుళ్లు సంభవించాయని పాక్ ఆర్మీ ప్రకటించింది. రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్‌బేస్ సమీపంలో శక్తివంతమైన పేలుడు సంభవించింది. ఇదిలావుంటే, ఇస్లామాబాద్ నివాసితులు వరుసగా మూడు పేలుళ్ల శబ్దాలు విన్నారని తెలుస్తోంది. ఆ వివరాలు
పాకిస్తాన్‌లోని రావల్పిండి సమీపంలో ఒకదాని తర్వాత ఒకటి మూడు పేలుళ్లు సంభవించాయని పాక్ ఆర్మీ ప్రకటించింది. రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్‌బేస్ సమీపంలో శక్తివంతమైన పేలుడు సంభవించింది. ఇదిలావుంటే, ఇస్లామాబాద్ నివాసితులు వరుసగా మూడు పేలుళ్ల శబ్దాలు విన్నారని తెలుస్తోంది. భారీగా నష్టం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. మరోవైపు, పోలీసులు, రెస్క్యూ బృందాలను సంఘటనా స్థలానికి పంపించారు. ఇస్లామాబాద్, లాహోర్, రావల్పిండితో సహా ఆరు ప్రధాన నగరాల్లో భారీ పేలుళ్లు సంభవించినట్లు వార్తలు వస్తున్నాయి. షోర్కోట్లోని రఫికి ఎయిర్‌బేస్ సమీపంలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. రావల్పిండిలోని వైమానిక స్థావరంపై భారత యుద్ధ విమానాలు క్షిపణులను ప్రయోగించాయని పాకిస్తాన్ సైనిక ప్రతినిధి ఆరోపించారు. ఈ దాడి రెండు దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలను తీవ్రంగా పెంచుతుందని అన్నారు. మే 10 ఉదయం 3:15 నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు అన్ని విమానాలకు పాకిస్తాన్ గగనతలం మూసివేస్తు్న్నట్లు పాకిస్తాన్ విమానాశ్రయాల అథారిటీ ప్రకటించింది. పాకిస్తాన్‌లోని పెషావర్‌లో పెద్ద పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. పాకిస్తాన్‌లోని నూర్ ఖాన్, షోర్కోట్, మురిద్ వైమానిక దళ స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు పాకిస్తాన్ ఆర్మీ ప్రతినిధి తెలిపారు. అయితే, వైమానిక స్థావరంపై ప్రతీకార చర్యను భారతదేశం ఇంకా ధృవీకరించలేదు.
Also read
- అన్నను స్కూల్ బస్సు ఎక్కించేందుకు తల్లి వెంటే వచ్చి.. అదే బస్సు కిందపడి మూడేళ్ల బాలుడు మృతి!
- వేడి సాంబార్లో పడి మహిళ మృతి.. సీసీ కెమెరాలో షాకింగ్ దృశ్యాలు!
- విష్ణుమూర్తి నాభి నుంచే పద్మం ఎందుకు పుట్టింది? బ్రహ్మదేవుడి ఆవిర్భావం వెనుక అసలు రహస్యం ఇదే!
- దుర్ముహూర్తం అంటే ఏమిటి? ఈ సమయంలో శుభకార్యాలు ఎందుకు చేయరు? కారణం ఇదే!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?





