March 13, 2025
SGSTV NEWS
CrimeTelangana

గల్లంతు అయిందా? గాయబ్‌ చేశారా?… మిస్టరీగా మారిన సుదీక్ష మిస్సింగ్‌ కేసు



అమెరికాలో భారత సంతతి విద్యార్థిని సుదీక్ష ఆచూకి ఇంకా లభించలేదు. ఆమె మిస్సింగ్‌ మిస్టరీగా మారింది. కరేబియన్‌ దేశానికి విహారయాత్రకు వెళ్లిన సుదీక్ష ఓ బీచ్‌ దగ్గర అదృశ్యమైంది. రంగంలోకి దిగిన స్థానిక పోలీసులు.. ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సుదీక్ష వర్జీనియాలో పిట్స్‌బర్గ్ యూనివర్సిటీలో చదువుకుంటోంది. అయితే, గత వారం ఆమె తన ఫ్రెండ్స్‌తో కలిసి కరేబియన్‌ దేశానికి విహారయాత్రకు వెళ్లారు. ఈ క్రమంలో మార్చి 6న స్థానికంగా


అమెరికాలో భారత సంతతి విద్యార్థిని సుదీక్ష ఆచూకి ఇంకా లభించలేదు. ఆమె మిస్సింగ్‌ మిస్టరీగా మారింది. కరేబియన్‌ దేశానికి విహారయాత్రకు వెళ్లిన సుదీక్ష ఓ బీచ్‌ దగ్గర అదృశ్యమైంది. రంగంలోకి దిగిన స్థానిక పోలీసులు.. ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సుదీక్ష వర్జీనియాలో పిట్స్‌బర్గ్ యూనివర్సిటీలో చదువుకుంటోంది. అయితే, గత వారం ఆమె తన ఫ్రెండ్స్‌తో కలిసి కరేబియన్‌ దేశానికి విహారయాత్రకు వెళ్లారు. ఈ క్రమంలో మార్చి 6న స్థానికంగా ఉన్న రియూ రిపబ్లికా రిసార్ట్‌ బీచ్‌ దగ్గర మిస్‌ అయినట్లు ఫ్రెండ్స్‌ చెబుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గాలింపు చేపట్టారు.


అయితే సుదీక్ష ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా సుదీక్షను ఎవరైనా కిడ్నాప్‌ చేశారా ?, లేక హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ కోణం ఉందా అన్న యాంగిల్‌లో విచారణ చేపట్టారు. ఐదు రోజులు గడిచినా ఆమె ఆచూకీ దొరక్కపోవడంతో పోలీసులు గాలింపు మరింత ముమ్మరం చేశారు. అయితే, ఈ కేసు ఇప్పుడు మరో మలుపు తిరిగింది. తమ కుమార్తెను కిడ్నాప్‌ చేసి ఉంటారని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మరోవైపు, సుదీక్షను చివరిసారిగా చూసిన ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

అయితే, సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా.. మార్చి 6వ తేదీ తెల్లవారుజామున 3 గంటల వరకు సుదీక్ష ఆమె స్నేహితులతో కలిసి రిసార్ట్‌లో పార్టీ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఆమె ఐయోవాకు చెందిన 24 ఏళ్ల టూరిస్టు జాషువా స్టీవెన్‌ రిబెతో కలిసి బీచ్‌కు వెళ్లినట్లు తేలింది. దీంతో పోలీసులు అతడిని ప్రశ్నించగా.. పొంతన లేని సమాధానాలు చెప్పాడు. సుదీక్షను భారీ అల లాక్కెళ్లిందని ఒకసారి.. తాను పడుకున్నానని, ఏమీ తెలియదని మరోసారి చెప్పాడు. దీంతో తమ కుమార్తెను ఎవరైనా కిడ్నాప్‌ చేసి ఉంటారని సుదీక్ష తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు చేపట్టాలని పోలీసులను అభ్యర్థించారు.


ఒకవేళ ఆమె బీచ్‌లో గల్లంతై ఉంటే.. ఇప్పటికే తీరానికి కొట్టుకురావాలి కదా. ఇప్పటివరకు ఆమె మృతదేహం లభించలేదు. సాధారణంగా మా కుమార్తె ఎప్పుడూ వెంట ఫోన్‌ తీసుకెళ్తుంది. కానీ, ఈసారి ఫోన్‌, వాలెట్‌ స్నేహితులకు ఇచ్చి వెళ్లడం అనుమానాస్పదంగా ఉంది. ఆమెను ఎవరైనా అపహరించి ఉంటారఅని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని డొమినికన్‌ పోలీసులు వెల్లడించారు.

భారత్‌కు చెందిన సుదీక్ష తల్లిదండ్రులు అమెరికాకు వలస వెళ్లి అక్కడ శాశ్వత నివాస హోదా పొందారు. ప్రస్తుతం ఆమె పిట్స్‌బర్గ్‌ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్‌ చదువుతోంది.

Also read

Related posts

Share via