April 19, 2025
SGSTV NEWS
CrimeTelangana

మూడు రోజుల క్రితం మహిళ హత్య! అడ్డా కూలీలపైనే అనుమానాలు..

పరారీలో హంతకులు

దర్యాప్తు చేస్తున్న సిరిసిల్ల పోలీసులు

కరీంనగర్: సిరిసిల్ల ఉలిక్కిపడింది. కార్మికుల అడ్డా హత్యోదంతంతో తెల్లారింది. మద్యంమత్తులో ఓ మహిళను కొందరు అత్యంత కిరాతకంగా హతమార్చిన సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలో శుక్రవారం కలకలం సృష్టించింది. స్థానికులు తెలిపిన వివరాలు. సిరిసిల్ల పట్టణంలోని అనంతనగర్‌లో బిహార్‌కు చెందిన కొందరు కూలీలు ఒక ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు.

బీహార్‌ చెందిన రాంభిక్షు సదా, రుడల్‌సదా ఉండేవారు. వీరు స్థానిక లేబర్‌ అడ్డా వద్ద రోజువారీ కూలీలుగా, భవనం నిర్మాణ పనులు చేసుకునే వారు. ఈక్రమంలోనే వేములవాడ అర్బన్‌ మండలం కొడిముంజకు చెందిన అలకుంట రమ కూలీ పని కోసం నిత్యం సిరిసిల్ల లేబర్‌ అడ్డాకు వచ్చేది. పనిస్థలంలో బిహార్‌కు చెందిన కూలీలతో రమకు పరిచయం ఏర్పడింది. మద్యం అలవాటు ఉండడంతో పనులు ముగిసిన తర్వాత పలుమార్లు మద్యం తాగినట్లు స్థానికుల ద్వారా తెలిసింది.

అందరూ కూలి పనులు చేసుకునే సమయంలో ఏర్పడిన చనువుతో రమ బిహార్‌ కూలీలు ఉంటున్న గదికొచ్చినట్లు సమాచారం. మద్యం మత్తులో రాత్రి ఆమైపె అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యాస్థలంలో మద్యం బాటిళ్లు, మృతురాలి ఒంటిపై బట్టలు లేకపోవడం వారి అనుమానాలకు బలం చేకూరుస్తుంది.

సంఘటన స్థలాన్ని పరిశీలించిన సీఐ రఘుపతి హత్యకు పాల్పడింది ఎంత మంది అనే దానిపై స్పష్టత లేదన్నారు. మూడు రోజుల క్రితం హత్య జరిగి ఉంటుందని, గది నుంచి దుర్వాసన రావడంతో హత్య విషయం వెలుగుచూసినట్లు వివరించారు. హంతకులు పరారీలో ఉన్నారని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతురాలికి ముగ్గురు కూతుళ్లు ఉండగా ఇద్దరి పెళ్లిళ్లు జరిగాయి. చాలా ఏళ్ల క్రితం భర్త చనిపోయినట్లు పోలీసులు తెలిపారు

Also read

Related posts

Share via