కడప జిల్లా యర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలో దారుణఘటన జరిగింది. ఎలక్ట్రిక్ స్కూటర్‌కి ఛార్జింగ్ అవుతుండగా ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. దీంతో పక్కనే నిద్రిస్తున్న వెంకట లక్ష్మమ్మ (62) స్పాట్‌లో ప్రాణాలు కోల్పోయింది.
ఏపీలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్క సారిగా బ్లాస్ట్ అయింది. ఈ ఘటనలో స్పాట్‌లో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. అందుకు సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఎలక్ట్రిక్ స్కూటర్ బ్లాస్ట్
ఏపీలోని కడప జిల్లా యర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలో ఈ ఘటన జరిగింది. ఎలక్ట్రిక్ స్కూటర్‌కి ఛార్జింగ్ అవుతుండగా ఒక్కసారిగా పెద్ద పేలుడు సంభవించింది. దీంతో పక్కనే నిద్రిస్తున్న వెంకట లక్ష్మమ్మ (62) అనే మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మహిళ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
మరోక ఘోరమైన ఇన్సిడెంట్
ఇదిలా ఉంటే అనంతపురం జిల్లాలో మరో ఘోరమైన ఇన్సిడెంట్ జరిగింది. తాడిపత్రి మండలంలో శుక్రవారం రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. బోడాయిపల్లి గ్రామంలో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో వ్యక్తిపై వేట కొడవళ్లతో దాడి చేశారు. నడిపి కుల్లాయప్ప వరి పొలంలో వ్యవసాయ పనులు చేసుకుంటుండగా ఒకేసారి 6 మంది దాడికి దిగారు. కుల్లాయప్ప తరపు కూడా మరి కొందరు ఎదురుదాడికి వచ్చారు. దీంతో ఘర్షణలో ఐదుగురి తీవ్రగాయల పాలైయ్యారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025