వరంగల్ జిల్లాలో మరో లేడీ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకుంది. 2022లో వివాహం చేసుకున్న కానిస్టేబుల్ అర్చన కొద్దిరోజులకే భర్తతో విడాకులు తీసుకుంది. ఈ క్రమంలో డిప్రెషన్ లోకి వెళ్లిన ఆమె జీవితంపై విరక్తి చెంది ఎవరూ లేని సమయంలో చీరతో ఉరేసుకొని చనిపోయింది.
Constable Death: ఇటీవలే జనగామ జిల్లాలో పెళ్లి కావట్లేదని– ఏఆర్ మహిళా కానిస్టేబుల్ నీలిమ సూసైడ్ చేసుకున్న ఘటన మరవకముందే మరో లేడీ కానిస్టేబుల్ ప్రాణాలు తీసుకుంది. వరంగల్ జిల్లా కాజీపేట దర్గా ప్రాంతానికి చెందిన మహిళా కానిస్టేబుల్ అర్చన 2022లో వివాహం చేసుకుంది. అయితే ఈమెకు పెళ్లి మూడునాళ్ళ ముచ్చటగా ముగిసింది. పెళ్ళైన కొద్దిరోజులకే భర్తతో విడాకులు అయ్యాయి. ఆ తర్వాత అర్చన ఉద్యోగానికి కొన్నిరోజులు సెలవు పెట్టి మరో పోటీ పరీక్షలకు సిద్దమవడం మొదలు పెట్టింది. ఈ క్రమంలో డిప్రెషన్ లోకి వెళ్లిన అర్చన.. జీవితంపై విరక్తి చెంది దారుణానికి పాల్పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరేసుకొని చనిపోయింది.
పెళ్లి కావట్లేదని మరో కానిస్టేబుల్
మరోవైపు జనగామ జిల్లాకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ నీలిమ పెళ్లి సంబంధం కుదరడం లేదని మనస్థాపం చెంది ఉరేసుకొని చనిపోయింది. నీలిమ 2020లో తన పోలీస్ ట్రైనింగ్ పూర్తి చేసింది. ప్రస్తుతం వరంగల్ కమిషనరేట్‌లో ఏఆర్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తోంది. నీలిమ ఉద్యోగంలో చేరినప్పటినుంచి ఎంతో క్రమశిక్షణగా పనిచేస్తూ, అందరితో స్నేహంగా ఉండేంది. అయితే ఆదివారం రోజు తన నివాసంలో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కొడకండ్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- Vijayawada:పోలీస్ ల నుండి తప్పించుకునేందుకు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకేసిన యువకుడు
- Guntur: కాల్ బాయ్‌గా చేస్తే సూపర్ ఇన్‌కం.. టెమ్ట్ అయి కమిటయిన కొందరు.. ఆ తర్వాత
- Hyderabad: చదువుకోమని తల్లి మందలించిందని..
- Crime News: కరీంనగర్లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో తీసి..
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!