SGSTV NEWS online
CrimeUttar Pradesh

పట్టపగలే భార్య ప్రియుడి హత్య, భార్యకు వార్నింగ్,షాకింగ్


ప్రస్తుత సమాజంలో భార్యను భర్త, భర్తను భార్య నిర్దాక్షిణ్యంగా హత్య చేయడం పరిపాటిగా మారిపోయింది. స్వల్ప విషయాలకు , చట్టపరంగా తేల్చుకోవాల్సిన విషయాలకు మనుషుల ఉసురు తీయడం సునాయాసంగా జరిగిపోతోంది. ఉత్తరప్రదేశ్లోని మీరట్లో అలాంటి దారుణం ఒకటి వెలుగు చేసింది.

పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం పట్టపగలే, నలుగురూ చూస్తుండగానే అతిదారుణంగా ఒక వ్యక్తి తన భార్య ప్రియుడిని కాల్చి చంపేశాడు. బుధవారం మధ్యాహ్నం మీరట్-ముజఫర్నగర్ జిల్లా సరిహద్దు సమీపంలో ఉన్న సందడిగా ఉండే మార్కెట్లో చోటుచేసుకుంది. బాధితుడిని 28 ఏళ్ల సురేంద్ర (సునీల్)గా గుర్తించారు.

ఈ దారుణానికి సంబంధించిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రాంరాజ్లోని జగ్జీవన్ పురి ప్రాంతంలో నివసిస్తున్న సురేంద్ర తన మోటార్సైకిల్పై మార్కెట్ గుండా వెళుతుండగా దాడి జరిగింది వెనుక నుండి వచ్చిన ప్రదీప్, నడుము దిగువ భాగంలో తొలికాల్పులు జరిపాడు. అనంతరం నిందితుడిపై అతి సమీపంనుంచి కాల్పులు జరిపాడు. అడ్డు వచ్చిన వారిపై కూడా బెదిరింపులకు పాల్పడటం తీవ్ర దిగ్భ్రాంతి రేపింది. దీంతో తీవ్ర భయాందోళనలతో దుకాణదారులు, విక్రేతలు మార్కెట్ నుంచి పారిపోయారు.

పాత పగలే దీనికి కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. సుమారు 18 నెలల క్రితం, ప్రదీప్ భార్య పూనం ఇద్దరు చిన్నపిల్లల్ని వదిలేసి సురేంద్రతో పారిపోయింది.అప్పటినుంచీ కలిసే ఉంటున్న వీరు కోర్టు ద్వారా వారి సంబంధాన్ని అధికారికం చేసుకోవాలని యోచిస్తున్నారని సమాచారం. ఈ వ్యవహారంలో ప్రదీప్, సుధీర్ గతంలో బహిరంగ ఘర్షణకు దిగారు. దీంతో ఆగ్రహం పెంచుకున్న ప్రదీప్ ఈ హత్యకి పాల్పడినట్టు అధికారులు అనుమానిస్తున్నారు.

కాల్పుల తర్వాత, ప్రదీప్ నాలుగు నిమిషాల వీడియోను రికార్డ్ చేశాడు. ఈ హత్యకు తానే బాధ్యుడునని ఒప్పుకున్నాడు. నెక్స్ట్ టార్గెట్ నువ్వే అంటూ మాజీ భార్యకు కూడా తీవ్ర హెచ్చరికలు జారీ చేశాడు. అంతేకాదు 18 నెలలనుంచి తన మాటను పోలీసులు పట్టించుకోలేంటూ ఈ వీడియోను సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP)తో పంచుకోవాలని కోరాడు. మరో వైరల్ వీడియోలో నిందితుడి చుట్టూ అధికారులుండగానే ఎలాంటి పశ్చాత్తాపం లేని ప్రదీప్, ప్రశాంతంగా బీడీ వెలిగించి పొగ త్రాగుతున్నట్లు కనిపించాడు.

బాధితుడి కుటుంబం ఫిర్యాదు ఆధారంగా, నిందితుడు ప్రదీపన్ను అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశారు. ఎలాంటి ఘర్షణలు చెలరేగ కుండా ముందస్తు జాగ్రత్తగా అదనపు బలగాలను మోహరించారు. ప్రస్తుతం చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయి.

Read

Related posts