వికారాబాద్ జిల్లా: వికారాబాద్‌లో విషాదం నెలకొంది.పట్టణంలోని గంగారాం సాయి బాబా కాలనీలో మహిళా కానిస్టేబుల్ బలిజ దివ్య ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.
పోలీసుల వివరాల ప్రకారం.. దివ్య గత ఐదేళ్లుగా ధారూర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. శనివారం తెల్లవారుజామున తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
దివ్య మృతదేహం వద్ద పోలీసులు ఒక సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో ప్రియమైన అమ్మ, నా కుటుంబసభ్యులు నేను ఇటువంటి నిర్ణయం తీసుకున్నందుకు నన్ను క్షమించండి. నా చావుకు ఎవరు కారణం కాదు. మెంటల్ స్ట్రెస్ తట్టుకోలేక ఈ రాంగ్ స్టెప్ తీసుకుంటున్నా. అమ్మా.. నీకు నేను భారం కాకూడదని ఈ నిర్ణయం తీసుకున్నా. నాన్న ఉంటే బాగుండే అమ్మ. నాన్న లేనందుకే నీకు ఇన్ని కష్టాలు. నన్ను క్షమించు అమ్మా” అని అందులో రాసి ఉంది. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దివ్య ఆత్మహత్యకు గల అసలు కారణాలపై విచారణ కొనసాగుతోంది
Also read .
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- మరోసారి బయటపడ్డ సుకేష్ గుప్తా ‘గోల్డ్ మాల్’.. ఏకంగా నిజాం నగలకే ఎసరు..!
- ఏంటక్కా ఇది.. టిప్‌టాప్‌గా కారు దిగింది.. ఆ తర్వాత లవర్ కోసం చేయకూడని పని చేసి..
- వాడంతే.. అదో టైపు.. దొంగతనం చేస్తాడు.. ఇట్టే దొరికిపోతాడు..
- షాకింగ్.. 180 మంది అమ్మాయిల 350 వీడియోలు తీసి.! ఆ తర్వాత..





