SGSTV NEWS online
CrimeTelangana

భర్తను చంపేస్తానంటూ కత్తితో భార్య హల్ చల్?




వరంగల్ జిల్లా : జనవరి…వరంగల్ నడిబొడ్డున నిత్యం అత్యంత రద్దీగా ఉండే వరంగల్ చౌరస్తాలో ఒక మహిళ కత్తి పట్టుకొని చేసిన హంగామా కాసేపు హై టెన్షన్ కు గురిచేసింది, జువెలరీ షాప్ ముందు కత్తితో హల్ చల్ చేస్తూ ధర్నాకు దిగడంతో అక్కడు న్న వాళ్లు భయభ్రాంతులకు  గురయ్యారు.భర్తను చంపేస్తానని బెదిరిస్తూ వెంట పడడంతో భర్త జువెలర్స్ షాపులో దాక్కున్నాడు బుధవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి….



వరంగల్ సిటీ లోని కొత్త వాడకు చెందిన శ్రీకాంత్ కు నర్సంపేటకు చెందిన జ్యోత్స్న కు 15 సంవత్సరాలు క్రితం వివాహం అయింది వీరికి వైష్టవీ (10) అనే కూతురు ఉంది, గత కొన్ని సంవత్సరాలుగా వైష్ణవి మానసిక పరిస్థితి సరిగ్గా లేదని భర్త తనను వదిలేసి మరో మహిళతో వివాహే తర సంబంధం పెట్టుకున్నా డని జ్యోత్స్న ఆరోపిస్తుంది,

మరోవైపు జ్యోత్స్న  మాన సిక పరిస్థితి బాగాలేదని శ్రీకాంత్, కూతురు వైష్ణవికి దూరం ఉంటూ విడాకులకు దరఖాస్తు చేసుకున్నాడు కోర్టులో కేసు నడుస్తుండగా ఈ క్రమంలో జోష్నా  తన భర్త జువెలర్స్ షాపు ముం  దు ఉన్నాడని తెలుసుకొని కత్తి పట్టుకొని భర్తను వెంటాడి చంపేస్తానంటూ హంగామా చేసింది.

తన భర్త వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని తనను దూరం చేశాడని జోష్ణ  ఆరోపిస్తుంది, సంఘ టన స్థలానికి చేరుకున్న పోలీసులు జోష్న, ఆమె మామ లింగమూర్తి అదుపులోకి తీసుకున్నారు.

Also read

Related posts