వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధానికి అత్త అడ్డువస్తుందనే కారణంతో కోడలు ఆమెకు విషం కలిపిన కూల్‌డ్రింగ్ ఇచ్చింది. దీంతో చికిత్స పొందుతూ అత్త మరణించింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధానికి అత్త అడ్డువస్తుందనే కారణంతో కోడలు ఆమెకు విషం కలిపిన కూల్‌డ్రింగ్ ఇచ్చింది. దీంతో చికిత్స పొందుతూ అత్త మరణించడం కలకలం రేపుతోంది. తన తల్లిని భార్య చంపిందని భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని పర్వతగిరి మండలం పెద్దతండాలో భూక్య మంజుల, దేవేందర్ దంపతులు నివసిస్తున్నారు.
అయితే పెరుకవాడకు చెందిన సారయ్య అనే వ్యక్తితో.. మంజుల మూడేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. చివరికి ఈ విషయం ఆమె అత్తయ్య భూక్య గమ్మి(55)కి తెలిసింది. దీంతో పలుమార్లు అత్త కోడళ్ల మధ్య గొడవలు జరుగుతూనే ఉండేవి. గతంలోనే రెండుసార్లు అత్త తలపై మంజుల గాయం చేసింది. మరోసారి చేయి కూడా విరగ్గొట్టింది. గొడవలు తీవ్రమవ్వడంతో డిసెంబర్ 3న మంజుల తన అత్త గమ్మికి థమ్సప్ కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలిపి తాగించేలా చేసింది.
దీంతో కొద్దిసేపటి తర్వాత గమ్మి కిందపడి కొట్టుకుంటోంది. ఆమెను చూసిన కొడుకు దేవేందర్ స్థానిక ఆర్‌ఎంపీ వద్ద చికిత్స చేయించాడు. డాక్టర్ సూచన మేరకు తొలుత తొర్రూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించాడు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం వరంగల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లాడు. మళ్లీ అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా శుక్రవారం సాయంత్రం గమ్మి మృతి చెందింది. కొడుకు దేవేందర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
Also Read
- నేటి జాతకములు 19 డిసెంబర్, 2024
- ప్రేమికురాలికి ఫోన్ కొనిచ్చేందుకు తల్లినే చంపాడు
- ఓర్నీ వీడు ప్రిన్సిపాలా లేక రాక్షసుడా.. పిల్లలు అని చూడకుండా పైపుతో చితకబాది..
- Andhra News: రాత్రివేళ మందు పార్టీ అంటూ స్నేహితుడిని పిలిచాడు.. కట్ చేస్తే, చివరకు ఏం జరిగిందంటే..
- తీరని విషాదం.. పెళ్లైన 18ఏళ్లకు పుట్టిన మగబిడ్డ.. ఆడుకుంటూ విక్స్ మూత మింగేశాడు..!