ఏలూరు జిల్లాలో దారుణం జరిగింది. వరుసకు చెల్లి అయిన యువతిపై ఇద్దరు యువకులు రెచ్చిపోయారు. మద్యం మత్తులో ఆమెకు మాయమాటలు చెప్పి అసభ్యంగా ప్రవర్తించారు. ఎలాగోలా ఆమె తప్పించుకుని ఫ్యామిలీకి చెప్పింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోక్సో కేసు నమోదు చేశారు.
కామాంధులు రోజు రోజుకు చెలరేగిపోతున్నారు. వావి వరస సంబంధం లేకుండా అత్యంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. నమ్మిన వారినే నట్టెట ముంచుతున్నారు. కంటికి రెప్పలా కాపాడుకోవలసిన సొంత వారిపైనే అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా అలాంటి కామ కోరికలు ఉన్న ఇద్దరు యువకులు చెల్లిపై విరుచుకుపడ్డారు. వద్దు వద్దు అని వేడుకున్నా కనికరించలేదు.
కానీ వారి నుంచి ఎలాగోలా తప్పించుకుని బయటపడ్డ ఆ యువతి.. జరిగిన సంఘటనను వెళ్లి తమ తల్లిదండ్రులకు చెప్పింది. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని పోక్సో కేసు నమోదు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
మాయ మాటలు చెప్పి
ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా నూజివీడులోని ఓ ప్రభుత్వ కాలేజీలో యువతి ఇంటర్ చదువుతోంది. కాలేజీ సమయం అయిపోయిన తర్వాత ఇంటికి వెళుతున్న క్రమంలో ఆమెకు అన్న వరుసైన ఇద్దరు యువకులు పాటిబండ్ల సంతోష్, ముల్లంగి ప్రదీప్‌లు కాలేజీ నుంచి వెనకపడ్డారు. ఇక మరికొద్ది సేపట్లో ఇంటికి చేరుకుంటుందన్న సమయంలో ఆ యువతికి మాయమాటలు చెప్పి ఆమె బ్యాగ్‌ను వేరోక అమ్మాయికి అందించారు.
అక్కడ నుంచి ఆమెను బలవంతంగా బైక్‌పై ఎక్కించుకుని అజరయ్య పేటలోని సమాధుల వైపు తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆ ఇద్దరు యువకులు మద్యం మత్తులో ఉండి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. వద్దు వద్దు అని ఆమె వేడుకున్నా వదల్లేదు. చివరికి ఎలాగోలా వారినుంచి తప్పించుకుని ఆ యువతి జరిగిన విషయాన్ని తన ఫ్యామిలీకి చెప్పింది. దీంతో వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో.. ఆ ఇద్దరు యువకులపై పోక్సో కేసు నమోదు చేశారు.
Also read
- అన్నను స్కూల్ బస్సు ఎక్కించేందుకు తల్లి వెంటే వచ్చి.. అదే బస్సు కిందపడి మూడేళ్ల బాలుడు మృతి!
- వేడి సాంబార్లో పడి మహిళ మృతి.. సీసీ కెమెరాలో షాకింగ్ దృశ్యాలు!
- విష్ణుమూర్తి నాభి నుంచే పద్మం ఎందుకు పుట్టింది? బ్రహ్మదేవుడి ఆవిర్భావం వెనుక అసలు రహస్యం ఇదే!
- దుర్ముహూర్తం అంటే ఏమిటి? ఈ సమయంలో శుభకార్యాలు ఎందుకు చేయరు? కారణం ఇదే!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?





