తాడేపల్లిగూడెంలో శేఖర్ అనే వ్యక్తి భార్య ఇటీవల గల్ఫ్ నుంచి వచ్చింది. మరోసారి గల్ఫ్ వెళ్తానంటే శేఖర్ నిరాకరించారు. భార్యను భయపెట్టాలని తాను పురుగుల మందు తాగడంతో పాటు కొడుకు సాత్విక్‌కు కూడా తాగించాడు. దీంతో చికిత్స పొందుతూ సాత్విక్ మృతి చెందాడు.
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో దారుణ ఘటన జరిగింది. భార్యపై కోపంతో ఓ తండ్రి కొడుకు ప్రాణం తీసిన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే తాడేపల్లిగూడెంలో శేఖర్ అనే వ్యక్తి ఉంటున్నాడు. ఇతని భార్య ఇటీవల గల్ఫ్ నుంచి వచ్చింది. మరోసారి గల్ఫ్ వెళ్తానంటే శేఖర్ నిరాకరించారు. ఎలాగైనా ఆమె వెళ్తానని అనడంతో.. భార్యను భయపెట్టాలని కొడుకుని బలి చేశాడు. నిన్ను ఎలా ఆపాలో తెలుసంటూ.. శేఖర్ పురుగుల మందు తాగడంతో పాటు కొడుకు సాత్విక్‌కు కూడా తాగించాడు. దీంతో చికిత్స పొందుతూ సాత్విక్ మృతి చెందాడు. ప్రస్తుతం శేఖర్ పరిస్థితి కూడా విషమంగా ఉంది.
భార్య సరిగ్గా వంట చేయలేదని..
ఇదిలా ఉండగా ఇటీవల భార్య వంట సరిగా చేయలేదనే కోపంతో భర్త నరికి నరికి చంపాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మాగడి సమీపంలోని మత్తికెరెలో రంగయ్య (68), తిమ్మమ్మ (65) దంపతులు ఎన్నో ఏళ్లుగా కూలిపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తరచూ వీరి మధ్య చిన్న చిన్న మనస్పర్థాలు జరుగుతుండేవి. ఒక్కోసారి గొడవలు కూడా పడేవారు.
అయితే బుధవారం రాత్రి వంట చేసే విషయంలో భార్య తిమ్మమ్మతో భర్త రంగయ్య గొడవ పెట్టుకున్నాడు. ఆ గొడవ కాస్త పెద్దదిగా మారడంతో ఆమెపై దాడి చేశాడు. కొబ్బరి తురిమే పీటతో నరికి హత్య చేశాడు. అనంతరం ఆ రాత్రి ఇంట్లోనే ఉండి.. గురువారం ఉదయం తిరుపతికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. దీంతో అతడిని రామనగరలో మాగడి పోలీసులు అరెస్టు చేశారు.
Also read
- AP Crime: విశాఖలో దారుణ హత్య.. చికిత్స పొందుతూ లోహిత్ మృతి
- AP crime : పీఎం కిసాన్ యాప్ ఫేక్ లింక్ పంపి రూ.10 లక్షలు కొట్టేశారు!
- Gang War: శ్రీకాళహస్తిలో అర్ధరాత్రి గ్యాంగ్ వార్ కలకలం
- EX MLA Prasanna Kumar Reddy: వైసీపీకి బిగ్ షాక్.. మాజీ ఎమ్మెల్యే ఇంటిపై దాడి – ఫర్నీచర్, కారు ధ్వంసం
- Abortions: ఒక్కో అబార్షన్ కు రూ.50 వేలు.. భువనగిరిలో దారుణ దందా.. అడ్డంగా దొరికిన డాక్టర్!