July 3, 2024
SGSTV NEWS
NationalViral

పవర్ స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం.. భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనాలు! వీడియో వైరల్

కోటా, ఏప్రిల్ 5: ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లోని కోట ప్రాంతంలోని విద్యుత్ పంపిణీ సంస్థలో శుక్రవారం (ఏప్రిల్ 5) భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున అగ్ని కీలలు ఎగసిపడ్డాయి. దీంతో పవర్‌ స్టేషన్ చుట్టు పక్కల ప్రాంతాలకు దట్టమైన పొగలు వ్యాపించాయి. మంటలు, పొగ కారణంగా ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. యంత్రాలతో నీల్లు చల్లుతూ మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.

ఇందుకు సంబంధించిన వీడియో దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీడియోలో దట్టమైన పొగతో నిండిన పవర్‌ స్టేషన్‌పై అగ్నిమాపక సిబ్బంది పైపులతో నీళ్లు చల్లుతూ మంటలు ఆర్పేందుకు యత్నించడం చూడొచ్చు. ప్రమాదం సమయంలో లోపల ఎంత మంది ఉన్నారు? ప్రాణనష్టం ఏమైనా జరిగిందా? అసలు ప్రమాదం ఎలా జరిగింది? అనే విషయం విషయాలు ఇంకా తెలియరాలేదు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

కాగా గత నెలలో ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలోని ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో భారీ అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో నాలుగేళ్ల బాలిక సజీవ మృతి చెందింది. చింతకొంట గ్రామంలోని బాలికల పోర్టకేబిన్ పాఠశాలలో జరిగిన ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇప్పటి వరకు తెలియరాలేదు. హాస్టల్‌ మంటలు చెలరేగడంతో లోపల ఉన్న 380 మంది విద్యార్థులను పోర్టా క్యాబిన్ సిబ్బంది, స్థానికులు సురక్షితంగా రక్షించగలిగారు. అయితే, ఓ విద్యార్థి చెల్లెలు మాత్రం మంటల్లో చిక్కుకుని మృతి చెందినట్లు పాఠశాల విద్యా శాఖ అధికారులు మీడియాకు తెలిపారు. మృతి చెందిన బాలిక పాఠశాల విద్యార్థి కాదు. అక్కడే చదువు కుంటోన్న తన అక్క వద్దకు గత కొన్ని రోజుల క్రితం చెల్లెలు వచ్చిందని, ఇంతలో ప్రమాదం జరగడంతో మంటల్లో చిక్కుకుని మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

Also read

Related posts

Share via