కాకినాడ జిల్లా పిఠాపురం వైకాపా అభ్యర్థి వంగా గీత కార్యాలయాన్ని ఓటర్లు చుట్టుముట్టారు. కొందరికి డబ్బిచ్చి తమకు ఇవ్వలేదంటూ ఆందోళనకు దిగారు.
పిఠాపురం: కాకినాడ జిల్లా పిఠాపురం వైకాపా అభ్యర్థి వంగా గీత కార్యాలయాన్ని ఓటర్లు చుట్టుముట్టారు. కొందరికి డబ్బిచ్చి తమకు ఇవ్వలేదంటూ ఆందోళనకు దిగారు. తమకు అన్యాయం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని వారిని చెదరగొట్టారు.
మరోవైపు యు.కొత్తపల్లి మండలం కొండవరంలో ఓటర్లు రోడ్డెక్కారు. ప్రమాణం చేస్తేనే డబ్బులిస్తామని వైకాపా నాయకులు చెప్పడంతో ఎదురు తిరిగి ఆందోళనకు దిగారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రమాణం చేయబోమని తేల్చిచెప్పారు. అభ్యర్థుల నుంచి తమ పేరిట డబ్బు తీసుకుని పంపిణీ చేయడం లేదని ఆరోపించారు.
Also read
- హనుమాన్ జయంతిని ఏడాదిలో రెండు సార్లు ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
- ఆర్ధిక ఇబ్బందులా, జీవితంలో సమస్యలా హనుమాన్ జయంతి రోజున ఇంట్లో ఇలా పూజ చేయండి..
- హనుమంతుడికి ఇష్టమైన ఈ నైవేద్యం పెడితే మీ కోరికలు నెరవేరుతాయి..!
- సతీసమేత హనుమంతుడు..! తెలంగాణలో ఈ ప్రత్యేక ఆలయం
- Nellore: నెల్లూరు జిల్లాలో భర్త, అత్తమామల పైశాచికం.. కోడలిని వివస్త్రను చేసి హత్య!