అందరూ చూస్తుండగానే ఒక వాలంటీర్ సాటి మహిళను వివస్త్రను చేసి బ్లేడుతో గాయపరిచిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో గురువారం చోటుచేసుకుంది.
పాలకొల్లు పట్టణం, మార్కెట్ – : అందరూ చూస్తుండగానే ఒక వాలంటీర్ సాటి మహిళను వివస్త్రను చేసి బ్లేడుతో గాయపరిచిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో గురువారం చోటుచేసుకుంది. బాధితులు, స్థానికుల కథనం ప్రకారం.. పురపాలక సంఘం సరఫరా చేసే నీటి ట్యాంకర్ వద్ద చిన్నపాటి ఘర్షణ తలెత్తగా సూర్యకుమారి అనే మహిళపై అదే ప్రాంతానికి చెందిన వాలంటీర్ కొల్లాబత్తుల మంజు చేయి చేసుకున్నారు. సర్దిచెప్పడానికి బాధితురాలి కుమార్తె విసాక నాగలక్ష్మి వారి వద్దకు వెళ్లగా.. మంజు అందరూ చూస్తుండగానే ఆమె నైటీని చించేశారు. బ్లేడుతో దాడి చేశారు. బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు.
Also read
- గుంటూరు మిర్చి ఎంటర్టైన్మెంట్స్ వారు చిత్రీకరించిన పాట విడుదల…
- నేటి జాతకములు…17 అక్టోబర్, 2025
- Lakshmi Kataksham: శుక్ర, బుధుల మధ్య పరివర్తన.. ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం పక్కా..!
- HYD Crime: హైదరాబాద్‌లో దారుణం.. బాత్రూం బల్బ్‌లో సీసీ కెమెరా పెట్టించిన ఓనర్.. అసలేమైందంటే?
- షుగర్ ఉన్నట్లు చెప్పలేదని భార్య హత్య