SGSTV NEWS online
Andhra PradeshCrimeViral

Vizag News: వైజాగ్‌లో కలకలం.. వీధి రౌడీల్లా కొట్టుకున్న విజ్ఞాన్ కాలేజ్ విద్యార్థులు.. వీడియో


దువ్వాడ విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాలలో యువతరంగ్ పోస్టర్ ఆవిష్కరణలో జూనియర్ సీనియర్స్ మధ్య వివాదం చెలరేగింది . కర్రలతో రౌడీలా సీనియర్స్, జూనియర్‌ విద్యార్థులు కొట్టుకున్నారు. ఘర్షణపై పలువురు విద్యార్ధులపై బీఎన్ ఎస్ 324 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.

Vizag News:  ఏపీలో మరో ర్యాగింగ్ ఘటన కలకలం రేపుతోంది. దువ్వాడలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలో సీనియర్లు జూనియర్‌ విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖలోని దువ్వాడ విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థు మధ్య గొడవ చోటు చేసుకుంది. కాలేజీలో ఏటా జరిగే యువతరంగ్ పోస్టర్ ఆవిష్కరణ సమయంలో విద్యార్థులందరు కలిపి డ్యాన్సులు చేశారు.




రౌడీలా కొట్టుకున్న సీనియర్స్, జూనియర్స్:
అయితే.. ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థి కాలు.. EEE థర్డ్ ఇయర్ చదువుతున్న సూర్య అనే విద్యార్థికి తగిలింది. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణకు దారి తీసింది. కాలు తగిలించిన విద్యార్థి క్షమాపణలు చెప్పిన సీనియర్ విద్యార్థి వినలేదు. అతనిపై కోపం పెంచుకుని మరి తన స్నేహితులతో కలిసి ఆ విద్యార్ధిని సీనియర్లు కలిసి కొట్టారు. దీంతో బాధిత విద్యార్థి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.  స్నేహితులతో కలిసి దారుణంగా కొట్టినందరుకు బాధితుడు ఫిర్యాదుతో పేర్కొన్నారు.


విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాలలో గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయని పోలీసులు తెలిపారు. ఎన్నిసార్లు జరిగిన విజ్ఞాన్ యాజమాన్యం మాత్రం విద్యార్థుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజ్ఞాన కళాశాలలో విద్యార్థులపై పర్యవేక్షణ లేకపోవడం వలన తరుచు ఇలాంటి ఘర్షణలు జరుతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఘర్షణపై దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేశారు. పలువురు విద్యార్ధులపై బీఎన్ ఎస్ 324 సెక్షన్ క్రింద కేసు నమోదు చేశారు.

Also read

Related posts