SGSTV NEWS
Andhra PradeshCrime

విజయవాడ.చిట్టినగర్: మద్యం మత్తులో భార్యను చంపేశాడో భర్త.

మద్యం మత్తులో తన భార్యను చంపేశాడో భర్త. ఈ ఘటన విజయవాడ టూ టౌన్ కొత్తపేట పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

ఈ ఘటన విజయవాడ టూ టౌన్ కొత్తపేట పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షేక్ నగీనా అనే మహిళ తన భర్త బాజీతో కలిసి కంసాలిపేటలో నివాసం ఉంటోంది. బాజీ పెయింటర్.. నగీనా(32) ఓ సమోసాల తయారీ కేంద్రంలో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. బాజీ మద్యానికి బానిసై రోజూ భార్యతో గొడవపడేవాడు. ఇవాళ మద్యం మత్తులో ఆమెతో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలోనే కత్తితో నగీనా గొంతు కోసి చంపేశాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. బాజీని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

Also read

Related posts