SGSTV NEWS
Andhra PradeshSpiritual

ఘనంగా ప్రారంభమైన వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆత్మార్పణ దినోత్సవ వేడుకలు

ఒంగోలు:



మాఘశుద్ధ విదియ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ప్రదర్శన ఆత్మార్పణ దినోత్సవ సందర్భంగా ఒంగోలు అమలనాధుని వారి వీధిలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి దేవస్థానంలో 30వ తేదీ గురువారం, 31వ తేదీ శుక్రవారం రెండు రోజులపాటు ఎంతో భక్తియుతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉదయం ఏడు గంటలకు అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. తదుపరి విజయవాడ వాస్తవ్యులు అంబడిపూడి మారుతి ప్రసాద్ శర్మ చే శ్రీ చక్ర నవావరణార్చన పూజా కార్యక్రమం నిర్వహించారు.

తదుపరి కుమారి పూజ, హారతి సమర్పించారు. సాయంత్రం జరిగిన కార్యక్రమాల్లో భాగంగా పెద్ద సంఖ్యలో విచ్చేసిన ఆర్యవైశ్య మహిళలందరూ చండీ పారాయణ వాసవి అష్టకం పాఠించారు, తదుపరి శ్రీ వాసవి కోలాట భజన మండలి వారి కోలాటంతో గుడి ఉత్సవం నిర్వహించారు. ఆలయ అర్చకులు ఫణి శర్మ మరియు శర్మలు నవ హారతులతో అమ్మవారికి నీరాజనాలు సమర్పించారు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ తదియారాధన సంఘ సభ్యులు కార్యక్రమ నిర్వహణ చేశారు.

Related posts