SGSTV NEWS
Andhra PradeshCrime

కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై అసభ్యకర పోస్టులు



మాజీ ఉపముఖ్యమంత్రి పీఏ ఖాజా అరెస్టు అనంతరం బెయిల్ పై విడుదల



కడప : కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టులు పెట్టిన మాజీ ఉపముఖ్యమంత్రి అంజాద్బాషా పీఏ(వ్యక్తిగత కార్యదర్శి) షేక్ మొహమ్మద్ ఖాజాను ఒకటో పట్టణ పోలీసులు అరెస్టుచేశారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు తన కార్యాలయంలో గురువారం నిందితుడిని మీడియా ఎదుట హాజరుపరిచి వివరాలు వెల్లడించారు. అంజాద్బాషా సోదరుడు అహమ్మదాబాషా ప్రోత్సాహంతో కడప ఎమ్మెల్యేపై మొహమ్మద్భాజా ఉద్దేశపూర్వకంగా సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టుల్ని పెట్టి వైరల్ చేశాడంటూ… ఎమ్మెల్యే భర్త తెదేపా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి సెప్టెంబరు 23న ఒకటో పట్టణ రాణాలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు. నమోదైంది. మాధవిరెడ్డి గురించి 2024 జనవరిలో విజయలక్ష్మి అనే మహిళ.. అసభ్యకరంగా మాట్లాడింది. ఆ మాటలున్న వీడియోను మొహమ్మద్ ఖాజా వైరల్ చేశాడు. అతను ఇలా చేయడం రెండోసారి కావడంతో ఆరెస్టు చేసి, తన ఫోన్ను స్వాధీన పరచుకున్నట్లు డీఎస్పీ చెప్పారు. అంజాద్ బాషా, అహమ్మద్ బాషాలపైనా కేసులు నమోదు చేశామన్నారు. మొహమ్మద్ ఖాజాను మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా బెయిల్ మంజూరు చేశారని చెప్పారు. విలేకరుల సమావేశంలో ఒకటో పట్టణ సీఐ రామకృష్ణయాదవ్ ఉన్నారు.

Also read

Related posts