వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత కొడాలి నాని అజ్ఞాతంలోకి వెళ్లడం ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఏ క్షణమైనా నాని అరెస్ట్ ఉంటుందన్న ప్రచారం సాగుతోంది. మరో వైపు వల్లభనేని వంశీపై మరో 6 కేసులు నమోదు చేయడానికి రంగం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లాలో ఇటీవల దారుణం జరిగింది. మైలవరం మండలం ములకలపెంట గ్రామానికి చెందిన కడియం శ్రీనివాస రావు ఈనెల ఎనిమిదో తేదీన హత్యాకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు ఆయన్ను హత్య చేశారు. అనంతరం మొక్కజోన్న తోటలో అనుమానాస్పద స్థితిలో ఆయన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.
దీంతో భూ తగాదాలే తన తండ్రి హత్యకు కారణమని మృతి చెందిన శ్రీనివాస రావు కొడుకు పుల్లారావు ఆరోపించాడు. టీడీపీ నేత చల్లా సుబ్బారావు, అతని అనుచరులే తన తండ్రిని హత్య చేశారని ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దర్యాప్తులో విస్తుపోయే నిజాలు
పుల్లారావు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులకు దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. తండ్రి శ్రీనివాస్‌ను కొడుకు పుల్లారావే హత్య చేసినట్లు తమ దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. యుట్యూబ్‌లో చూసి తండ్రి హత్యకు పథకం రచించాడని పోలీసుల విచారణలో తేలిందని అన్నారు. ఆస్తి విషయంలో గొడవ జరిగిన సమయంలో తండ్రి శ్రీనివాసరావును కొడుకు పుల్లారావు కొట్టి చంపాడని నేరాన్ని అంగీకరించాడని పేర్కొన్నారు.
ఆన్లైన్ బెట్టింగ్, షేర్ మార్కెట్లో డబ్బులు పోగొట్టుకుని పుల్లారావు అప్పులపాలైయ్యాడని, అప్పులు తీర్చడానికి తండ్రి శ్రీనివాసరావు అంగీకరించకపోవడంతో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డట్లు తెలిపారు. ఈ కేసును తప్పు దోవ పట్టించేందుకు పుల్లారావు పక్క పొలం చల్లా సుబ్బారావుతో గతంలో ఉన్న సరిహద్దు వివాదాన్ని ఇప్పుడు తెరపైకి తెచ్చి తప్పించుకొనేందుకు ప్రయత్నించాడని ఏసిపి తెలిపారు. ముద్దాయిని కోర్టులో హాజరు పరుస్తామని పేర్కొన్నారు.
అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. తన భర్తను కావాలనే ఇరికిస్తున్నారని పుల్లారావు భార్య ఆరోపిస్తోంది. తన మామకు, భర్తకు ఎలాంటి గొడవలు లేవని ఆమె చెప్పడంతో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. తన భర్తను అధికారపార్టీ ఒత్తిడితోనే అనవసరంగా ఈ కేసులో ఇరికించారని ఆమె ఆవేదన చెందుతున్నారు.
ఇక ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ చూపిన మైలవరం సిఐ దాడి చంద్రశేఖర్, మైలవరం ఎస్సై కె.సుధాకర్, జి కొండూరు కె.సతీష్ కుమార్, గంపలగూడెం ఎస్సై శ్రీనివాస్ లు, సిబ్బందిని విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు అభినందించారని ఏసిపి వై ప్రసాదరావు తెలిపారు.
Also read
- నేటి జాతకములు..19 జూలై, 2025
- Visakhapatnam Kidney Racket: అందమైన సాగరతీరంలో కిడ్నీ రాకెట్ కలకలం..! విచారణలో విస్తుబోయే వాస్తవాలు..
- Andhra News: ఉద్యోగం వదిలి వచ్చి పెళ్లైన వ్యక్తితో కూతురు ప్రేమాయణం.. తల్లిదండ్రులు ఏం చేశారంటే!
- Andhra: వానకాలంలో వడదెబ్బ.. 8 మంది విద్యార్థినులకు అస్వస్థత
- Crime: సీసీటీవీ ఫుటేజీలో అడ్డంగా బుక్కయ్యాడు… మల్లన్నకే మస్కా కొట్టాలని చూసిన ఆలయ ఉద్యోగి
- Andhra: వైష్ణవిని ప్రియుడు చంపలేదు.. ఇంకా మిస్టరీగానే గండికోట బాలిక హత్య కేసు..
- Vastu Tips: పూజ గదిలో పొరపాటు కూడా ఈ విగ్రహాలను పెట్టుకోకూడదు.. ఈ దేవుళ్ళ విగ్రహలు కలిపి పెట్టడం అశుభం ఎందుకంటే..
- Rakhi Festival: రాఖీ పండగ రోజున అన్నదమ్ములకు కాకుండా ఇంకెవరికి రాఖీ కట్టవచ్చు.. శాస్త్రాలు ఏమి చెబుతున్నాయో తెలుసుకోండి
- Lord Shiva Puja: శివుడు అభిషేక ప్రియుడు.. అభిషేకం, రుద్రాభిషేకం మధ్య తేడా ఏమిటో తెలుసా..
- నేటి జాతకములు…18 జూలై, 2025