*సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత అన్ని జాతులు,వర్గాల పైన ఉంది…. శ్రీశ్రీశ్రీ వామనాశ్రమ మహాస్వామి*
అమరావతి:
వైశ్య కుల గురువు, శృంగేరి పీఠ శిష్య పరంపర, పరమపూజ్య శ్రీశ్రీశ్రీ వామనాశ్రమ మహా స్వామిజీ వైశ్య గురు మఠం వారణాసి మరియు హల్దీపూర్, కర్ణాటకకు చెందిన స్వామీజీ
శ్రీ విశ్వావసు నామ సంవత్సర 22వ చాతుర్మాస్య వ్రతం సందర్భంగా గుంటూరు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో చాతుర్మాస దీక్ష సందర్భంగా దేవాలయంలో కొలువై ఉన్నారు. వారి కరపద్మములతో శ్రావణ శుక్రవారం రోజున బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మకు దుశాల్వాతో సత్కరించి మహా ఆశీర్వాదం అందజేశారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని, దేవాలయ వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత బ్రాహ్మణ వైశ్య కులాలపై ఎంతైనా ఉందని, సనాతన ధర్మాన్ని కాపాడటంలో ఈ ఇరు జాతులు పురాణ కాలం నుంచి ముఖ్య భూమిక పోషిస్తున్నారని, ఈ నవ నాగరిక సమాజంలో కూడా ఇద్దరు అన్నదమ్ముల వలె కలిసిమెలిసి సనాతన ధర్మాన్ని కాపాడుతున్నారని, అలానే మిగిలిన జాతులు వారు కూడా సనాతన ధర్మం పట్ల దేవాలయాల పట్ల మక్కువ చూపేలా చిన్ననాటి నుండే ఆధ్యాత్మిక చింతనను వారి వారి పిల్లలకు అలవాటు చేయాలని, ఈ సనాతన ధర్మాన్ని భవిష్యత్ తరాలకు అందేలా సమాజంలో ఉన్న అన్ని జాతులు, వర్గాలు కృషి చేయాలని స్వామీజీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నిడమానూరు సురేష్, రవి, బొడ్డుపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Also read
- మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్టియు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!
- వరాహ జయంతి సెప్టెంబర్ 13నా.. 14నా? తేదీ, శుభ సమయం, పూజా విధానం ఇదే!





