SGSTV NEWS online
Spiritual

Garuda Puranam: పక్కవాళ్లకు స్వీట్ ఇవ్వకుండా తింటే కూడా పాపమే? గరుడ పురాణంలో ఘోరమైన శిక్ష?



గరుడ పురాణంలో ఏ పాపాలు చేస్తే ఏ శిక్షలు పడతాయో స్పష్టంగా ఉంటుంది. ఒక వ్యక్తి మరణించిన తర్వాత స్వర్గానికి వెళతాడా, నరకానికి వెళతాడా లేదా మళ్లీ జన్మలో ఎలా పుడతాడో తెలుసుకోండి..


సనాతన హిందూ ధర్మంలో గరుడ పురాణానికి చాలా ప్రాశస్త్యం ఉంది. దీనికి మహాపురాణ్ అని పేరు. ఈ గ్రంథం చెడు పనులను విడిచిపెట్టి మంచి జీవితాన్ని గడపాలని సూచిస్తుంది.  గరుత్మంతుడి సందేహాలు తీర్చడానికి శ్రీమహావిష్ణువు చెప్పే సమాధానాలే గరుడపురాణం. ఇందులో భాగంగా మీరు చేసే పాపం ఆధారంగా వచ్చే జన్మలో ఎలా పుడతారో చూసుకోండి.

పాపం-వచ్చే జన్మలో పుట్టుకగోహత్య – మరగుజ్జు వాడుగా పుడతాడుకన్యాహత్య – కుష్టు రోగిగా జన్మిస్తాడుస్త్రీ హత్య, గర్భ పాతం  – నిత్య రోగ బాధస్వగోత్ర స్త్రీ సంబంధం – నపుంసక జన్మగురుభార్యతో అక్రమ సంబంధం – దుష్కర్మం గల జన్మమాంసం భక్షణ చేసే బ్రాహ్మణుడు – అతిరక్ష అనే కుష్టు వ్యాధిఎవ్వరికీ పెట్టకుండా స్వీట్స్ తినేవాడు-  గరళగండ రోగ జన్మ పొందుతాడుశ్రార్ధంలో అశుచి ఆహారం పెట్టేవాడు – చిత్రకుష్టువు రోగి జన్మగురువుని అవమానించిన వాడు – అపస్మార రోగి జన్మ వేద శాస్త్రాలని నిందించేవాడు – పాండురోగి జన్మ

అబద్ధపు సాక్ష్యం చెప్పేవాడు – మూగవాడి జన్మఏకపంక్తి లో తేడాగా భోజనం పెడితే – ఒక కన్ను లేనివాడిగా పుడతాడుపెళ్లి చెడగొట్టే వాడు – పెదవుల్లేని జన్మ పొందుతాడుపుస్తకం దొంగతనం చేస్తే- అంధుడై పుడతాడుగో-బ్రహ్మణులని కాలితో తన్నేవాడు – కుంటి వాడై పుడతాడుఅబద్ధాలు చెప్పేవాడు – స్పష్టమైన వాక్కు లేని జన్మఅబద్ధాలు వినేవాడు – చెవిటివాడిగా పుడతారువిషం పెట్టేవాడు – ఉన్మత్త జన్మ పొందుతాడుఇళ్ళు తగలేబెట్టే వాడు – బట్టతలతో బాధపడతాడు

బంగారం దొంగలించే వాడు – పుప్పి గోళ్ళతో జన్మిస్తాడులోహాలు దొంగలించే వాడు – నిర్ధనుడిగా జన్మిస్తారుఅన్నం దొంగలించే వాడు – ఎలుకలా పుడతారుధాన్యం దొంగలించే వాడు – మిడత జన్మెత్తుతారునీళ్లు దొంగలించే వాడు – చాతకపక్షిలా జన్మిస్తారుకూరలు,ఆకులు దొంగలించే వాడు – నెమలి జన్మ తేనె అపహరించేవాడు – దోమగా జన్మిస్తాడుమాంసం అపహరించే వాడు – గ్రద్ద గా జన్మిస్తాడుఆత్మ హత్య చేసుకుంటే – కొండ మీద నల్ల త్రాచుగా పుడతాడు

ఇవన్నీ పుస్తకాల్లో ప్రస్తావించినవి, పండితులు చెప్పిన వివరాలు, వీటిని ఎంతవరకూ విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.

Related posts