హన్మకొండ: ప్రేమ పేరుతో యువ కుడి వేధింపులు భరించ లేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హనుమకొండ జిల్లా దామెర మండలం ముస్త్యాల పల్లిలో శుక్రవారం చోటుచేసు కుంది. ఎస్సై ఇమ్మడి వీరభద్ర రావు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కట్ట స్నేహ (22) పీజీ పూర్తిచేసి కొంతకాలంగా ఇంటివద్ద ఉంటుంది.
ఇదే గ్రామానికి చెందిన జీడిమెట్ల శ్రీధర్ కొంతకాలంగా ఆ యువతిని ప్రేమిస్తున్నానంటూ వేధిస్తున్నాడు. తనను పెళ్లిచేసుకోవాలని, లేని పక్షంలో తనతో వాట్సాప్‌లో చేసిన చాటింగ్ బంధువులకు పంపిస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ విష యం యువతి తన తల్లిదండ్రులకు తెలపగా శ్రీధర్ ను పెద్దమనుషుల సమక్షంలో మందలించారు. అయిన ప్పటికి మరో నంబర్ నుంచి ఫోన్ చేస్తూ తననే పెళ్లి చేసుకోవాలని, లేని పక్షంలో చంపుతానని బెదిరించాడు.
దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి శుక్రవారం తెల్లవారుజామున ఇంటి సమీపంలోని బావిలోదూకి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న ఎస్ ఐ సంఘటనస్థలానికి చేరుకొని, మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం మార్చురీకి తరలించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్ ఐ తెలిపారు.
Also read
- మద్యం సేవించి యువతి ఇంటికి వెళ్లిన యువకుడు.. కొద్దిసేపటికే తీరని విషాదం..!
- రాత్రి బాగానే ఉంది.. తెల్లారేసరికి కత్తిరించి ఉంది.. హాస్టల్లో అమ్మాయిల జడలు కత్తిరిస్తున్నదెవరు?
- యువకుడి ప్రాణాలు బలిగొన్న ఇయర్ ఫోన్
- 8 నెలల పసి బిడ్డను చంపి తల్లి మృతి!.. సూసైడ్ నోట్లో సంచలన విషయాలు! అసలు ఏం జరిగింది?
- చదువుల గుడిలో వేధింపుల కలకలం.. విద్యార్థినులతో అసభ్య ప్రవర్తన.. కట్‌చేస్తే..





