April 21, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

క్రికెట్ గ్రౌండ్‌లో పిడుగుపాటు.. చెట్టుకిందికెళ్లిన ఇద్దరు బాలురు మృతి


ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం పెదఓబినిపల్లిలో క్రికెట్ ఆడుతూ ఇద్దరు పిల్లలు చనిపోయారు. వర్షం వస్తుందని చెట్టుకిందికి వెళ్లగా పిడుగు పడింది. పిడుగుపాటుకు పులుగుజ్జు సన్నీ(16), గోసిపోతల ఆకాశ్(18)లు మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి.

ఆంద్రప్రదేశ్ ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం పెదఓబినిపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. పిడుగుపాటుకు ఇద్దరు బాలురు మృతి చెందారు. ఒకరికి తీవ్ర గాయాలైయ్యాయి. సెలవులు కావడంతో పిల్లలు పంటపొలాల్లో క్రికెట్ ఆడుతున్నారు. ఆదివారం సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వర్షం కురింసింది. దీంతో పిల్లలు అంతా దగ్గర్లో ఉన్న చెట్టు కిందికి వెళ్లారు. అదే సమయంలో పెద్ద పిడుగు పడింది.

ఊరు విషాదమై..
పిడుగుపాటుకు ఇద్దరు బాలురు చనిపోయారు. పులుగుజ్జు సన్నీ (16), గోసిపోతల ఆకాశ్ (18)లు అక్కడికక్కడే మృతి చెందగా.. గొర్రెలు కాపరి అయిన మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. అతన్ని చికిత్స కోసం హాస్పిటల్‌కి తరలించారు. పరిస్థితి విషమంగా ఉంది. ఇద్దరు బాలుర మరణ వార్తతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పెదఓబినిపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసి బెస్తవారిపేట పోలీసులు విచారణ చేపట్టారు.

Also read

Related posts

Share via