November 22, 2024
SGSTV NEWS
CrimeTelangana

నిజంగా ‘రెవెన్యూ’ అధికారే!… వీడియో

అతడిదేమో మున్సిపాలిటీలో రెవెన్యూ అధికారి ఉద్యోగం. వేతనం రూ. వేలల్లోనే అయినా.. ఇటీవల అతడి ఇంట్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) తనిఖీ చేస్తే కళ్లు చెదిరేలా నోట్ల కట్టలు బహిర్గతమయ్యాయి.



ఆదాయం రూ.77.67 లక్షలు.. ఆస్తులు రూ.6.07 కోట్లు బహిరంగ మార్కెట్ విలువ రూ.20 కోట్లకు పైమాటే. ఇదీ నిజామాబాద్ కార్పొరేషన్ ఉద్యోగి అక్రమాల చిట్టా అనిశా తాజా దర్యాప్తులో నరేందర్ లీలలు బహిర్గతం


హైదరాబాద్: అతడిదేమో మున్సిపాలిటీలో రెవెన్యూ అధికారి ఉద్యోగం. వేతనం రూ. వేలల్లోనే అయినా.. ఇటీవల అతడి ఇంట్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) తనిఖీ చేస్తే కళ్లు చెదిరేలా నోట్ల కట్టలు బహిర్గతమయ్యాయి. నగదే ఏకంగా రూ.2.93 కోట్లు లభ్యమైంది. ఇతర ఆస్తుల పత్రాలను ఒక్కరోజు లెక్కిస్తేనే మొత్తం విలువ రూ.6.07 కోట్లుగా తేలింది.

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఇన్ఛార్జి రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్న దాసరి నరేందర్ బాగోతమిది. ఆశ్చర్యపోయే రీతిలో అక్రమాస్తులు కూడగట్టిన అతడి నిర్వాకంపై అనిశా అధికారులు లోతుగా దర్యాప్తు చేయడంతో విస్మయకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిజామాబాద్లోని వినాయక్ నగర్ అశోక్టవర్స్లో నివసించే నరేందర్ 1995లో ఉద్యోగంలో చేరారు. కారుణ్య నియామకం కింద కార్పొరేషన్లోనే జూనియర్ అసిస్టెంట్గా అడుగుపెట్టి తర్వాత సీనియర్ అసిస్టెంట్గా పదోన్నతి పొందారు. 1995 నుంచి ఇప్పటివరకు అతడితోపాటు కుటుంబసభ్యుల ఆదాయ వనరులను ఏసీబీ అధికారులు విశ్లేషించారు.

• ప్రస్తుతం అతడితోపాటు భార్య, కుమారుడు, తల్లి, సోదరుడు, అక్కాచెల్లెళ్ల పేరిట ఉన్న ఇళ్లు, ప్లాట్లు, వ్యవసాయ భూముల విలువ రూ.1.98 కోట్లుగా తేల్చారు.

• ఉద్యోగం ద్వారా వచ్చిన ఆదాయంతోపాటు కుటుంబసభ్యులు సంపాదించిన సొమ్మును రూ.1.2 కోట్లుగా లెక్కగట్టారు. అతడి కుటుంబ వ్యయం సుమారు రూ.42.33 లక్షలుగా తేల్చారు. అంటే అతడి ఆదాయం నుంచి వ్యయం పోను.. అతడి వద్ద ఉండాల్సిన సొమ్ము రూ.77.67 లక్షలు మాత్రమే. కానీ ఏసీబీ తనిఖీ చేసినప్పుడు ఆస్తుల విలువ రూ.6.07 కోట్లుగా తేలడంతో అవి ఆదాయానికి దాదాపు ఎనిమిది రెట్లని నిర్ధారించారు. కేవలం స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం తేలిన మొత్తమిది. బహిరంగ మార్కెట్ ప్రకారం చూస్తే.. ఆ విలువ రూ. 20 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా వేశారు.

• కార్పొరేషన్లో రెవెన్యూ అధికారిగా కాసులపంట పండించడంలో నరేందర్ ఆరితేరారు. ఇందుకోసం క్విడ్ ప్రో కో (నీకింత.. నాకింత) దందాను తెరపైకి తెచ్చారు. కొత్తగా చేపట్టే నిర్మాణాల విస్తీర్ణాన్ని మదింపు చేసి అందుకు సరిపడా పన్ను లెక్కగట్టడం ఆ విభాగం బాధ్యత. అక్కడే నరేందర్ తన చేతివాటాన్ని ప్రదర్శించారు. దరఖాస్తుదారుల్ని పిలిపించుకొని మాట్లాడేవారు. వాస్తవ విస్తీర్ణం కంటే తక్కువగా చూపడం ద్వారా దరఖాస్తుదారులు ఇచ్చే లంచాలు నరేందర్ జేబులో వేసుకునేవారని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు.



Also read

Related posts

Share via