*పొలంలో రైతులు బావులు తీసుకుంటే సుమన్ టీవీ పేరుతో వసూళ్లకు పాల్పడుతున్న యూట్యూబర్స్*..
మహబూబాబాద్ జిల్లా కొత్త గూడ, గంగారం మండలాలలో గత పదేళ్లపాటు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న ఇంటి ముందు మొరంబోసుకుందామనుకున్న, ఇంట్లో బాత్రూం కట్టుకోవాలన్న ఇసుక, మొరం తీసుకోవడానికి శాఖ పరమైన అనుమతులు తీసుకోవడానికి ఇబ్బందిగా ఉండేది….. అంతేకాకుండా రైతులు ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్నా వ్యవసాయ భూములకు కూడా సాగునీరు సేద్యం కొరకు బోర్లు వేసుకుందాం అనుకున్న శాఖ పరమైనటువంటి అనుమతులు అంత తొందరగా వచ్చేవి కాదు. సదరు రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏజెన్సీ ఆదివాసి గిరిజన రైతుల కొరకు సాగు చేసుకుంటున్న భూములకు హక్కు పత్రాలు కల్పించడం జరిగింది. తాజాగా రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతాల్లో అటవీ శాఖ ప్రత్యేక అనుమతులలో హక్కు పత్రం ఉన్న భూముల్లో బోర్లు గానీ, అట్టి భూముల్లో బావులు తీసుకోవచ్చని, రైతులతో దరఖాస్తులు తీసుకొని వాటిని క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత రైతుకు అనుమతిఇవ్వడం జరుగుతుంది.. ఇదంతా బాగానే ఉంది కానీ సుమన్ టీవీ అనే ఒక ప్రమోషనల్ యూట్యూబ్ ఛానల్ తో కొత్తగూడ మండలం సాధిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన వెంకట్, నర్సంపేట కు చెందిన ఇమ్రాన్ లు ఈ ప్రమోషనల్ ఛానల్ తో ఏజెన్సీలో ఎక్కడ బోర్ ఏసినా, ఎక్కడ బోర్ తీసిన వెంటనే వెళ్లి ఆ వాహనాన్ని ఆపి డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నారు.. బోరబండ్ల యజమానులు దగ్గర, జెసిబి యజమానులను భయభ్రాంతులకు గురిచేస్తూ మీ బండ్లను సీజేపిస్తాం, మేము తలుచుకుంటే మీ బండ్లు నడవవు అని సంబంధిత వాహన యజమానులపై బెదిరింపులకు పాల్పడుతున్నారు.. తాజాగా శనివారం నాడు కొత్తగూడ మండల కేంద్రంలోని గాంధీనగర్ గ్రామానికి చెందిన కొంత మంది గిరిజన రైతులు వారికి ఉన్నటువంటి హక్కు పత్రం ఉన్న భూముల్లో సాగు నీరు కొరకు బావి తినిపిస్తుంటే ఆ ప్రదేశానికి సుమన్ టీవీ యూట్యుబర్ర్ అని నర్సంపేటకు చెందిన ఇమ్రాన్ అనే వ్యక్తి మీకు అనుమతి ఉందా?? ఎవరి అనుమతి తీసుకున్నారు?? మీకు ఎలా అనుమతిస్తారు?? అని రైతులతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే సంబంధిత రైతు మేము ఏజెన్సీ ప్రాంతానికి చెందిన ఆదివాసి గిరిజన రైతులం, నేను గతంలో ఆరో ఎఫ్ ఆర్ చైర్మన్ గా పనిచేసిన, గత 40 ఏళ్ల నుండి *నేను సాగు చేసుకుంటున్న భూమిలో భావి తీసుకోవడానికి సుమన్ టీవీ వారి అనుమతి తీసుకోవాలా ?? అని సుమన్ టీవీ యూట్యూబర్ ను* *సంబంధిత రైతు నిలదీశాడు..*
తదనంతరం సుమన్ టీవీ మహబూబాబాద్ జిల్లా ఇన్చార్జి పేరుతో చెలామణి అవుతున్న కొత్తగూడ మండలం సాదిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వెంకట్ అనే యూట్యూబర్ బావిలు తీసుకుంటుంటే అవగాహన లేకుండా అడ్డంగా లోగోలు పెట్టి, రైతులతో చర్చించకుండా, వాస్త , అవాస్తవాలను తెలుసుకోకుండా, ఏజెన్సీ ఆదివాసి రైతులను భయభ్రాంతులకు గురిచేస్తూ కాలం వెలదీస్తున్నాడు… *ఇదిలా ఉంటే ఉమ్మడి రాష్ట్రంలోనే సుమన్ టివి అనే ఒక యూట్యూబ్ ప్రమోషనల్ ఛానల్ కేవలం ఫేస్బుక్ల లో ఆదరించే వారే ఉన్నారు తప్ప, ఎక్కడ కూడా సమస్యలు ఉత్పన్నమైనచోట వార్త రూపంలో ప్రదర్శించిన దాఖలాలు లేవు.. కానీ ఏజెన్సీ ప్రాంతం కొత్తగూడలో మాత్రం మెయిన్ స్ట్రీ మీడియా న్యూస్ ఛానల్ లకు పైబడి, రైతుల పై వ్యతిరేకంగా వార్తలను రాస్తూ ఏజెన్సీ రైతాంగానికి భయభ్రాంతులను గురి చేస్తూ ఒక యూట్యూబ్ ఛానల్ పేరుతో అడ్డగోలు వార్తలు రాస్తూ ఉన్న పరిస్థితి… మరి ఈ సుమన్ టీవీ ఛానల్ ఏదైనా కేబుల్లో గాని శాటిలైట్ లో గాని ఎయిర్టెల్, డిష్ టీవీ వంటి చానల్లో కూడా ఈ వార్తలు ప్రచురించబడవు… కేవలం ఒక వాట్సప్ అనే సాంకేతిక పరిజ్ఞానం అడ్డగా ఎంచుకొని తాను తీసిన వీడియోలను,తనే మార్ఫింగ్ చేసి వీడియో లను వార్తలు రూపకంగా ప్రదర్శిస్తూ నన్ను అడిగే వారు ఎవరూ లేరని ఈజీ మానికి అలవాటు పరిస్థితి ఈరోజు ఏజెన్సీలో దాపరిచింది*… *ఈ సుమన్ టీవీ అనేది ఒక పేడ్ (డబ్బులు తీసుకునే ఛానల్) ఆర్టికల్ ప్రమోషనల్ ఛానల్* , కానీ ఏజెన్సీలో ఈ ఛానల్ పేరుతో రైతులు బోర్ వేసుకున్న, బావి తీసుకున్న వెంటనే ఈ సుమన్ టీవీ లోగో ఆ రైతు పొలంలో ప్రత్యక్షమవుతోంది.. ఏందయ్యా అంటే ఈ బోర్ బండి ఎవరిది, ఈ జెసిబి ఎవరిది ఆ ఓనర్ నెంబర్ మాకు ఇవ్వండి అని రైతులను ఇబ్బందుల గురిచేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఏజెన్సీలో కలకలం రేపుతుంది… *డబ్బులు సంపాదించడానికి అనేక మార్గాలు ఉన్నప్పటికీ కేవలం ఒక యూట్యూబ్ ఛానల్ పేరుతో మీడియా ముసుగులో ఇటు రైతులను ఇబ్బందుల గురిచేస్తూ జర్నలిజం యొక్క విలువలను పూర్తిగా హననం చేస్తూ జర్నలిజం లాంటి పవిత్రమైన వృత్తికి కళంకం సృష్టిస్తున్నటువంటి ఈ చీడపురుగులపై పాలక వర్గాలు ,మేధావి వర్గాలు, ప్రజలే గుణ పాటం చెప్పాలని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు*…
Also read
- Hyderabad: వేకువజామున నీళ్లు కావాలని ఇంట్లోకి దూరాడు.. ఆమె లోపలికి వెళ్లగానే..
- ఆడ వేషంలో పెళ్లైన ప్రియురాలి ఇంటికి బాయ్‌ఫ్రెండ్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- Telangana: మటన్ కర్రీ వండలేదన్న పాపానికి.. భర్త ఏం చేశాడో చూస్తే దిమ్మతిరుగుద్ది.!
- Andhra News: పాపం పెద్దావిడ తిరుపతి వెళ్లేందుకు బస్సు ఎక్కింది.. లీలగా మాయ చేసి..
- Telangana: ఇంటర్ ఎగ్జామ్ రాస్తున్న విద్యార్థిని.. ఒక్కసారిగా శబ్దం.. ఏమైందంటే..?