ప్రమాదానికి ముందు వినియోగంలో ఉన్న ఫోన్ పేలిపోవటం పట్ల ఫోన్ యజమాని, షాప్ సిబ్బంది ఆశ్చర్యపోయారు. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని షోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పాడైపోయిన మొబైల్‌ఫోన్ని రిపేర్ చేస్తుండగా అది ఒక్కసారిగా పేలిపోయింది. ఈ షాకింగ్ ఘటన కేరళలోని కోజికోడ్ జిల్లా ముక్కాట్‌లో మంగళవారం సాయంత్రం జరిగింది. చలీల్ అనే వ్యక్తి మొబైల్ రిపేరింగ్ షాపు నిర్వహిస్తున్నాడు. అతడి వద్దకు ఓ వ్యక్తి ఫోన్‌ను రిపేర్ కోసం తీసుకొచ్చాడు. ఆ ఫోన్‌ను షాపులోని ఉద్యోగి రిపేర్ చేస్తున్నాడు. ఆ సమయంలో ఒక్కసారిగా ఫోన్ పేలిపోయింది. మంటలు చెలరేగగా, ఉద్యోగికి తృటిలో ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రమాదానికి ముందు వినియోగంలో ఉన్న ఫోన్ పేలిపోవటం పట్ల ఫోన్ యజమాని, షాప్ సిబ్బంది ఆశ్చర్యపోయారు. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని షోషల్ మీడియాలో పోస్ట్ చేశారు
మొబైల్ మెకానిక్ చెప్పిన వివరాల ప్రకారం బ్యాటరీలు పాడైపోయిన మొబైల్ ఫోన్‌లను ఉపయోగించడం వల్ల ఇలాంటి పెద్ద ప్రమాదాలు సంభవిస్తాయని చెప్పారు
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025